ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ind vs Pak Match Effect: మ్యాచ్ రోజు అహ్మదాబాద్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. ఎంతో తెలిస్తే షాక్ అవడం పక్కా!..

ABN, First Publish Date - 2023-07-16T19:03:56+05:30

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరగనున్నభారత్, పాకిస్థాన్ మ్యాచ్ హడావిడి 3 నెలల ముందుగానే ప్రారంభమైంది. ఈ సారి మన దేశంలోనే జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైనా గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరగనున్నభారత్, పాకిస్థాన్ మ్యాచ్ హడావిడి 3 నెలల ముందుగానే ప్రారంభమైంది. ఈ సారి మన దేశంలోనే జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైనా గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో మైదానానికి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలని ఆశించే అభిమానులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అహ్మదాబాద్ వెళ్లేందుకు విమాన టికెట్లు, హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ విమాన టికెట్లు ధరలే అభిమానులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆకాశాన్నింటిన ధరలను చూసి అభిమానులు బెంబెలెత్తుతున్నారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ‌్‌ను ఉపయోగించుకుంటున్న విమానాయన సంస్థలు టికెట్ల ధరలను ఏకంగా ఆరింతలు పెంచేశాయి. దీంతో మ్యాచ్ జరిగే రోజుకు ఒక్క రోజు ముందుగా లేదా మ్యాచ్ రోజున అహ్మదాబాద్ వెళ్లడానికి టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న అభిమానులకు షాక్ తగులుతుంది. మ్యాచ్‌కు ముందు రోజు ఢిల్లీ నుంచి లేదా ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లడానికి విమాన టికెట్ల ధరలు ఏకంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఈ టికెట్ ధరలు రూ.3 వేలకు మించి ఉండవు. అంతెందుకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సైతం టికెట్ ధరలు రూ.3 వేలుగా ఉన్నాయి. కానీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న విమాయన సంస్థలు వీటిని రూ.20 వేలకు పెంచేశాయి. అయితే 3 నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నప్పటికీ ఈ స్థాయిలో ధరలు మండిపోవడం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


విమాన టికెట్లు బుక్ చేసుకునే ఈజీ మైట్రిప్ (EaseMyTrip) సీఏఓ (CEO), సహ-వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి మాట్లాడుతూ ‘‘ భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు ఆసక్తిగా ఉన్న చాలా మంది ఇప్పటికే తమ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. దీని కారణంగా ట్రావెల్ వెబ్‌సైట్‌లలో శోధనలు, బుకింగ్‌లు పెరిగాయి. ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నప్పటికీ, విమాన ఛార్జీలు సాధారణం కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఢిల్లీ-అహ్మదాబాద్ మధ్య ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధర రూ.3000గా ఉంటుంది. అయితే మ్యాచ్‌కి ఒకరోజు ముందు అదే టికెట్ ధర రూ.20,000గా ఉంది. ఇక మా వెబ్‌సైట్‌లో విమాన టిక్కెట్‌లు, శోధనల డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంది.’’ అని తెలిపారు.

అయితే ఈ భారీ ధరలు ఒక విమాన టికెట్లకే పరిమితం కాలేదు. మ్యాచ్‌కు ముందు రోజు, మ్యాచ్ జరిగే రోజు అహ్మదాబాద్‌లోని హోటళ్లలో రూంల ధరలు కూడా భారీగా పెంచేశారు. ఇప్పటికే చాలా హోటళ్లలో గదుల ధరలను ఒక రోజుకు గాను సాధారణం కంటే 10 రెట్లు అధికంగా పెంచేశారు. విలాసవంతమైన హోటళ్లలో సాధారణ రోజుల్లో ఒక గదికి ఒక రోజుకు గాను రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్యన ఉంటుంది. కొన్ని చోట్ల రూ.10 వేలకు కూడా ఉంటుంది. కానీ మ్యాచ్ జరిగే రోజున వీటి ధరలు రూ.40 వేల నుంచి లక్ష వరకు ఉన్నాయి. అయితే ఇంత భారీ ధరలు ఉన్నప్పటికీ అహ్మదదాబాద్‌లోని హోటళ్లలోగల చాలా గదులు బుక్ అయిపోయాయి. అటు విమాన టికెట్లు కూడా దాదాపుగా అయిపోయాయి. దీనిని బట్టే చెప్పేయొచ్చు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో.. అయితే ఈ ధరలను కాస్త పక్కన పెడితే మ్యాచ్ టికెట్ ధరలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ టికెట్ల ధరలు కూడా రికార్డు స్థాయిలో ఉండే అవకాశాలున్నాయి. ఇక భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియం సుమారు 1,32,000 మంది ప్రేక్షకుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 90,000 మందికి పైగా ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించారు. అయితే ఈ సారి అహ్మదాబాద్‌లో ఆ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - 2023-07-16T19:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising