Ashes 4th Test: జాక్ క్రాలే ఊచకోత.. టీ20 స్టైల్‌లో సెంచరీ.. దంచికొడుతున్న ఇంగ్లండ్
ABN, First Publish Date - 2023-07-20T20:18:42+05:30
యాషెస్ సిరీస్‌లో కీలకంగా మారిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే దుమ్ములేపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోతూ కోస్తూ పరుగుల వరద పారించాడు. వన్డే స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన క్రాలే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో కీలకంగా మారిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే దుమ్ములేపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోతూ కోస్తూ పరుగుల వరద పారించాడు. వన్డే స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన క్రాలే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున వేగంగా సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా టెస్టుల్లో క్రాలేకు ఇది నాలుగో సెంచరీ. ఇంగ్లండ్ బజ్ బాల్ వ్యూహానికి అనుగుణంగానే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన జాక్ క్రాలే 67 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం క్రాలే మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన క్రాలే ఫోర్లు, సిక్సులతో ఇంగ్లీష్ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 51 నుంచి 100 పరుగులను చేరుకోవడానికి 26 బంతులే తీసుకున్నాడు.
మరో ఓపెనర్ బెన్ డకెట్ ఒక్క పరుగుకే ఔటైనప్పటికీ క్రాలేకు మొయిన్ అలీ(54), జో రూట్ సహకరించడంతో ఇంగ్లండ్ స్కోర్ 200 దాటింది. తమ బజ్‌బాల్ వ్యూహాన్ని కొనసాగిస్తున్న ఇంగ్లండ్ ప్రస్తుతం దాదాపు 6 రన్‌రేటుతో బ్యాటింగ్ చేస్తోంది. 38 ఓవర్లలోనే ఆ జట్టు ఏకంగా 217 పరుగులు బాదేసింది. ఒకరకంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఇంగ్లండ్ బ్యాటర్లు దంచికొడుతున్నారు. కాగా అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్(51), మిచెల్ మార్ష్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ జట్టులో క్రిస్ వోక్స్ 5 వికెట్లతో చెలరేగాడు. బ్రాడ్ 2, అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.
Updated Date - 2023-07-20T20:18:48+05:30 IST