IndiaVsAustralia: టీమిండియా వికెట్ల వేట షురూ.. ప్రస్తుతం ఆసీస్ స్కోరు ఎంతంటే..
ABN, First Publish Date - 2023-02-17T11:18:06+05:30
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2023లో (border gavaskar trophy 2023) భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ షూరు అయ్యింది.
న్యూఢిల్లీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2023లో (border gavaskar trophy 2023) భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ షూరు అయ్యింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అతిథ్య భారత జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. 19 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా (40), లబుషేన్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్ ప్లేయింగ్: రోహిత్ శర్మ (కెప్టెన్), చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా ప్లేయింగ్: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, హ్యాండ్స్‌కోంబ్, క్యారీ, కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, మర్ఫీ, మ్యాథ్యూ.
Updated Date - 2023-02-17T11:18:08+05:30 IST