ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roger Binny: ఆంధ్ర క్రికెట్ జట్టులో అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులున్నారు: బీసీసీఐ అధ్యక్షుడు

ABN, First Publish Date - 2023-08-28T21:58:35+05:30

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పరంగా చాలా అభివృద్ధి చెందిందని భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. క్రీడాకారులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మంచి సదుపాయాలు, వసతులు కల్పిస్తుందని కొనియాడారు.

విశాఖ: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పరంగా చాలా అభివృద్ధి చెందిందని భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. క్రీడాకారులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మంచి సదుపాయాలు, వసతులు కల్పిస్తుందని కొనియాడారు. అలాగే ఆంధ్ర క్రికెట్ జట్టులో అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఉన్నారని ఆయన అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన బిన్నీ 1975లో విశాఖ రైల్వే స్టేడియంలో రంజీ మ్యాచులు ఆడడానికి వచ్చానని నాటి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోని దిగ్గజ క్రికెటర్లని కొనియాడారు. కపిల్ దేవ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుందని, 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్‌ను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. కపిల్‌దేవ్ మైదానంలో ఆడుతుంటే.. తాము పెవిలియన్ నుంచి చూస్తూ ఉండిపోయమని తెలిపారు. ఇక ప్రస్తుతం మహిళల క్రికెట్ చాలా అభివృద్ధి చెందిందన్నారు. మహిళల క్రికెట్ మ్యాచ్‌లకు మైదానాలు పూర్తిగా నిండడమే దీనికి నిదర్శనమని చెప్పారు.

Updated Date - 2023-08-28T21:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising