ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rohit Sharma: రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీపై జైషా ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-12-10T12:45:57+05:30

Jay Shah: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. అప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌కు ఆటగాడిగా కూడా దూరంగా ఉంటున్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాతి నుంచి పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. అప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌కు ఆటగాడిగా కూడా దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా నడిపించాడు. జట్టును ఫైనల్ చేర్చాడు. అదే సమయంలో గాయం కారణంగా హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే వ్యవహరించాలనే అభిప్రాయాలు ఎక్కువ మందిలో వ్యక్తమవుతున్నాయి. కొన్ని వార్తా నివేదికలు అయితే 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉంటాడని చెబుతున్నాడు.


ఇలాంటి సమయంలో ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించాడు. టీ20 ఫార్మాట్‌లోకి రోహిత్ శర్మ పునారగమనం, కెప్టెన్సీ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉందని చెప్పాడు. ‘‘ప్రస్తుతం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? టీ20 ప్రపంచకప్ జూన్‌లో జరగనుంది. అంతకన్నా ముందు మాకు ఐపీఎల్, అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్ ఉంది.’’ అని తెలిపాడు. అలాగే బెంగళూరులో కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ వచ్చే ఏడాది ఆగష్టులో ప్రారంభం అవుతుందని అన్నాడు. ‘‘బెంగళూరులో నూతనంగా నిర్మిస్తున్న జాతీయ క్రికెట్ అకాడమీ, ఈశాన్య భారత్, జమ్మూ కశ్మీర్‌లో క్రికెట్ అకాడమీలను ఆగష్టులో ప్రారంభిస్తాం. పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌ల్లో మేము ప్రజల్లో ఆసక్తిని పెంచాలి. 2, 3 రోజుల్లో ముగిసే టెస్టు మ్యాచ్‌ల కన్నా 4, 5 రోజులపాటు సాగే మ్యాచ్‌లపై ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ప్రేక్షకులు అలవాటు పడిన తర్వాత మరిన్ని పింక్ బాల్ టెస్టులు నిర్వహిస్తాం. పింక్ బాల్ టెస్టును చివరిగా ఆస్ట్రేలియాలో నిర్వహించారు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పింక్ బాల్ టెస్టు మ్యాచ్ నిర్వహించేందుకు మేము చర్చలు జరుపుతున్నాం.’’ జైషా చెప్పాడు.

Updated Date - 2023-12-10T12:45:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising