ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

500 మ్యాచ్‌ల క్లబ్‌లోకి కింగ్ కోహ్లీ.. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన ఆటగాళ్లెవరో తెలుసా?..

ABN, First Publish Date - 2023-07-20T21:18:22+05:30

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌తో (West Indies vs India 2nd Test) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లను (500 Matches) పూర్తి చేసుకున్నాడు. దీంతో 500 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరిన 4వ భారత క్రికెటర్‌గా.. మొత్తంగా 10వ ఆటగాడిగా నిలిచాడు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌తో (West Indies vs India 2nd Test) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లను (500 Matches) పూర్తి చేసుకున్నాడు. దీంతో 500 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరిన 4వ భారత క్రికెటర్‌గా.. మొత్తంగా 10వ ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ ఇప్పటివరకు 111 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. కాగా విరాట్ కోహ్లీ కంటే ముందు 500 మ్యాచ్‌ల క్లబ్‌లో 9 మంది ఆటగాళ్లు ఉన్నారు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) 664 మ్యాచ్‌లతో ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత శ్రీలంక మాజీ ఆటగాడు జయవర్దనే(Jayawardene) రెండో స్థానంలో ఉన్నాడు. జయవర్దనే 652 మ్యాచ్‌లు ఆడాడు. మూడో స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర (Sangakkara) 594 మ్యాచ్‌లు ఆడాడు. నాలుగో స్థానంలో ఉన్న మరో శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య తన కెరీర్‌లో 586 మ్యాచ్‌లు ఆడాడు. కాగా ఈ జాబితాలో వరుసగా 2, 3, 4 స్థానాల్లో శ్రీలంక ఆటగాళ్లే ఉండడం గమనార్హం.


ఆ తర్వాత ఐదో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 560 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఆరో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఉన్నాడు. ధోని 538 మ్యాచ్‌లు ఆడాడు. ఏడో స్థానంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రీదీ ఉన్నాడు. ఆఫ్రీదీ 524 మ్యాచ్‌లు ఆడాడు. ఎనిమిదో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కలీస్ 519 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్, మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్(Dravid) ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ద్రావిడ్ 509 మ్యాచ్‌లు ఆడాడు.

Updated Date - 2023-07-20T21:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising