ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Australia Team: ఒక్క ఏడాదిలో మూడు కప్పులు.. ఆస్ట్రేలియాకు గోల్డెన్ ఇయర్

ABN, First Publish Date - 2023-11-20T16:27:26+05:30

Australia: ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు కప్పులను కైవసం చేసుకుని గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లను కైవసం చేసుకుని ఈ ఏడాదిని ఆస్ట్రేలియా చిరస్మరణీయం చేసుకుంది.

ఈ ఏడాది ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇంగ్లండ్ లేదా ఇండియా గెలుస్తుందని పలువురు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. వన్డే ప్రపంచకప్ ప్రారంభంలోనూ రెండు బలమైన జట్ల చేతుల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఆ జట్టు అవకాశాలను చాలామంది కొట్టిపడేశారు. కానీ తమతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. వరుసగా రెండు పరాజయాలు ఎదురైనా డీలా పడకుండా వరుస విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. లీగ్ దశలో తమను ఓడించిన జట్లపై నాకౌట్లలో ప్రతీకారం తీర్చుకుంది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు, ఫైనల్లో టీమిండియాకు ఝలక్ ఇచ్చి ఏకంగా విశ్వవిజేతగా నిలిచింది. అంతేకాకుండా ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు కప్పులను కైవసం చేసుకుని గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది.

ఈ ఏడాది తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అది కూడా ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై వరుసగా తొలి రెండు టెస్టుల్లో గెలిచింది. ఆ తర్వాత మూడో టెస్టును డ్రా చేసుకున్నా.. నాలుగు, ఐదో టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓడింది. చివరకు 2-2తో సిరీస్ డ్రా కావడంతో గతంలో యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా దగ్గరే ఉండటంతో ఇప్పుడు కూడా వాళ్ల దగ్గరే యాషెస్ ట్రోఫీ భద్రంగా ఉంది. ఆ తర్వాత ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా వరుసగా రెండోసారి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరినా ఆస్ట్రేలియాకు తలొగ్గి ఓటమి పాలైంది. ఇప్పుడు మరోసారి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను వారి సొంతగడ్డపైనే ఫైనల్లో ఓడించి సగర్వంగా కప్పును ముద్దాడింది. తద్వారా ఆరోసారి తమ ఖాతాలో వన్డే ప్రపంచకప్‌ను చేర్చుకుంది. ఇలా ఒకే ఏడాది మూడు ప్రతిష్టాత్మక టోర్నీల్లో రాణించి ఆస్ట్రేలియా 2023ను గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. ఈ మూడు టోర్నీల్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన జట్టును ఏకతాటిపై నడిపించి విజయాలను నమోదు చేయడం విశేషం.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-20T16:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising