ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే.. చరిత్రలో ఇదే తొలిసారి..!!

ABN, First Publish Date - 2023-08-19T13:53:19+05:30

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగో సారి. 1987, 1996, 2011లో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరిగింది. అయితే గత మూడు సార్లు ఇండియాతో పాటు పాకిస్థాన్, శ్రీలంక కూడా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి మాత్రం వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే జరుగుతున్నాయి.

నాలుగేళ్లకొకసారి జరిగే వన్డే ప్రపంచకప్ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తి. రెండేళ్లకొకసారి టీ20 ప్రపంచకప్ జరిగినా, టెస్ట్ ఛాంపియన్ షిప్ జరుగుతున్నా అసలు సిసలు మజా అంటే వన్డే క్రికెట్ మాత్రమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగో సారి. 1987, 1996, 2011లో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరిగింది. అయితే గత మూడు సార్లు ఇండియాతో పాటు పాకిస్థాన్, శ్రీలంక కూడా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి మాత్రం వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే జరుగుతున్నాయి. తొలిసారిగా వన్డే ప్రపంచకప్ మొత్తం భారత్‌లోనే జరుగుతుండటం గమనించాల్సిన విషయం.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రికెటర్ తన కెరీర్‌లో ఒక్కసారైనా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ టోర్నీ అందుకే అభిమానులకు ఎంతో మజా అందిస్తుంది. 10 దేశాలకు తక్కువ కాకుండా వన్డే ప్రపంచకప్‌ను ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ అత్యధిక సార్లు (1975, 1979, 1983, 1999, 2019) ఆతిథ్యం ఇచ్చింది. ఇండియా మూడు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు, శ్రీలంక రెండు సార్లు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, కెన్యా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఒక్కొక్కసారి మాత్రమే వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి.


కాగా 1975, 1979లో జరిగిన ప్రపంచకప్‌లను వెస్టిండీస్ కైవసం చేసుకోగా.. 1983లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 1987లో ఆస్ట్రేలియా, 1992లో పాకిస్థాన్, 1996లో శ్రీలంక, 1999లో ఆస్ట్రేలియా, 2003లో ఆస్ట్రేలియా, 2007లో ఆస్ట్రేలియా, 2011లో టీమిండియా, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్ ప్రపంచకప్ విజేతలుగా నిలిచాయి. ఇప్పటివరకు అగ్రశ్రేణి జట్లకు సంబంధించి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఒక్కసారి కూడా వన్డే ప్రపంచకప్ సాధించలేదు. 2023లో భారత్ గడ్డపై జరిగే ప్రపంచకప్‌ను ఏ టీమ్ సాధిస్తుందో వేచి చూడాలి. 2011లో ప్రపంచకప్ సాధించిన టీమిండియాలో విరాట్ కోహ్లీ మాత్రమే ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు.

ఇది కూడా చదవండి: Virat Kohli: కింగ్ కోహ్లీ కెరీర్‌కు 15 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడింది ఈరోజే..!!

ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో 10 జట్లు ఆడుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఆప్ఘనిస్తాన్ తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి అర్హత సాధించడంలో వెస్టిండీస్ విఫలమైంది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా 9 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో టాప్-4లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. మొత్తం 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్‌తో పాటు ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

Updated Date - 2023-08-19T14:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising