ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: మళ్లీ తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ

ABN, First Publish Date - 2023-09-30T15:41:23+05:30

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్‌కు కలిసి వచ్చారని వార్తలు వస్తున్నాయి. దీంతో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాము త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని.. మీడియా వాళ్లు దయచేసి ఫోటోలు తీయవద్దని కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రిక్వెస్ట్ చేసినట్లు టాక్. నవంబర్‌ 5న విరాట్‌ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను పంచుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Asian Games: టెన్నిస్‌లో స్వర్ణం గెలిచిన భారత్

కాగా కొన్నాళ్ల పాటు కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమించుకున్న తర్వాత 2017లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. 2021లో ఈ దంపతులు వామిక అనే బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. టీమిండియా విజేతగా నిలవాలంటే విరాట్ కోహ్లీ ఫామ్ ఎంతో కీలకం. గత ఏడాది ఆసియా కప్‌తో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ మళ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇటీవల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 122 నాటౌట్‌తో అదరగొట్టాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ దాయాదిపై చెలరేగాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. అటు అనుష్క శర్మ కొంతకాలంగా నటనకు దూరంగా ఉంది. ఆమె తన సమయాన్ని పూర్తిగా వామిక కోసమే కేటాయిస్తోంది. అప్పుడప్పుడు కోహ్లీ ఆడుతున్న స్టేడియాలకు వెళ్లి అతడిని ప్రోత్సహిస్తోంది.

Updated Date - 2023-09-30T15:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising