ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagpur Test: రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు!

ABN, First Publish Date - 2023-02-11T19:48:59+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఓటమికి కారణమైన టీమిండియా(Team India)) స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Aashwin) బిగ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ విజయాల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భాతర జట్టు విజయాల్లో అశ్విన్ ఏకంగా 489 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు ఈ ఘనత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) పేరున ఉంది. కుంబ్లే భారత జట్టు విజయాల్లో 486 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడా రికార్డును అశ్విన్ తుడిచిపెట్టేశాడు.

నాగ్‌పూర్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో (Nagpur Test)లో భారత్ సమష్టిగా రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో చక్కని ప్రదర్శన కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 400 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) సెంచరీతో రాణించగా, రవీంద్ర జడేజా 70, అక్షర్ పటేల్ 84, మహమ్మద్ షమీ 37 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల దెబ్బకు చిగురుటాకులా వణికింది. ముఖ్యంగా అశ్విన్ దెబ్బకు వికెట్లను టపటపా రాల్చుకుంది. ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్(Ashwin) ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. షమీకి రెండు వికెట్లు దక్కాయి.

Updated Date - 2023-02-11T19:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising