ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: ప్రపంచకప్‌లో ఆసియా జట్ల రికార్డులు.. అన్నీ క్లీన్‌స్వీప్‌లే..!!

ABN, First Publish Date - 2023-10-16T13:52:34+05:30

టీమిండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఈ ప్రపంచకప్‌లో ఆసియా నుంచి ఆడుతున్న జట్లుగా నిలిచాయి. వన్డే ప్రపంచకప్‌లో ఆసియా జట్ల రికార్డులు చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతుండటం గమనించాల్సిన విషయం.

టీమిండియా గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఆసియా జట్ల ప్రదర్శన గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వన్డే ప్రపంచకప్‌లో ఆసియా జట్ల రికార్డులు చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతుండటం గమనించాల్సిన విషయం. టీమిండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఈ ప్రపంచకప్‌లో ఆసియా నుంచి ఆడుతున్న జట్లుగా నిలిచాయి. అయితే ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌ హిస్టరీలో టీమిండియాపై పాకిస్థాన్ గెలవలేదు. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరగ్గా పాకిస్థాన్‌పై టీమిండియా 8-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇటీవల దాయాదుల మధ్య జరిగిన పోరులో టీమిండియా ఏకపక్ష విజయాన్ని సాధించి పాకిస్థాన్‌పై విజయయాత్రను కంటిన్యూ చేసింది.

ఇది కూడా చదవండి: WC Afganistan vs England : చాంపియన్‌ను చిత్తు చేశారు

అలాగే వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై శ్రీలంక ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ రెండు జట్ల మధ్య కూడా ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరిగితే శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. అయితే 2023లో ఇంకా వీళ్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మరోవైపు బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ మధ్య ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ చరిత్రలో మూడు మ్యాచ్‌లు జరగ్గా అన్నీ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ విజయకేతనం ఎగురవేసింది. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆసియా జట్లలో ఆప్ఘనిస్తాన్ వన్డే ప్రపంచకప్‌లో ఇతర ఆసియా జట్లను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఓటమి రుచి చూపించిన ఆప్ఘనిస్తాన్ ఇప్పటివరకు ఆసియా జట్లపై ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. 2019 ప్రపంచకప్‌లో అయితే ఆడిన 9 మ్యాచ్‌లలోనూ ఓడి ఆప్ఘనిస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అలాంటి జట్టు ఇప్పుడు 2019 ప్రపంచకప్ విజేతను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Updated Date - 2023-10-16T13:52:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising