ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Astrotalk CEO: ఇండియా ప్రపంచకప్ గెలిస్తే.. రూ.100 కోట్లు పంపిణీ

ABN, First Publish Date - 2023-11-18T18:07:23+05:30

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు కొన్నిగంటల ముందు ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో భారత్ గెలవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఒకవేళ ఫైనల్లో భారత్ గెలిస్తే తమ కంపెనీ వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ తుది సమరం అంగరంగ వైభవంగా జరగనుంది. ఫైనల్‌లో టీమిండియా గెలవాలని అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారు. మరోవైపు టీమిండియా కచ్చితంగా విశ్వవిజేతగా నిలుస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు కొన్నిగంటల ముందు ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో భారత్ గెలవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఒకవేళ ఫైనల్లో భారత్ గెలిస్తే తమ కంపెనీ వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

కాగా 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన సమయంలో తాను కాలేజీలో చదువుకుంటున్నానని.. తన జీవితంలో అత్యంత ఆనందక్షణాల్లో అదొకటి అని ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా అన్నారు. ఆ రోజు రాత్రంతా మ్యాచ్ గురించే మాట్లాడుకున్నామని.. మ్యాచ్‌లో మన జట్టు వ్యూహం గురించే చర్చించుకున్నామని ఆయన గుర్తుచేసుకున్నారు. మ్యాచ్ ముందు రోజు అయితే ఎవరు గెలుస్తారా అంటూ సరిగ్గా నిద్ర కూడా పోలేదన్నారు. అలాంటి ఆనందం మరోసారి దక్కాలని కోరుకుంటున్నానని పునీత్ పేర్కొన్నారు. అందుకే ఈసారి మన దేశం ప్రపంచకప్ గెలిస్తే ఆ ఆనందాన్ని తమ యూజర్లతో కలిసి పంచుకోవాలనే తాను రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ప్రకటించినట్లు పునీత్ వివరించారు. కాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ వీక్షించేందుకు దేశ ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పలు కంపెనీలు పెద్ద తెరలు ఏర్పాటు చేసి ప్రజలు మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-18T18:07:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising