IND Vs AUS: మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు.. టీమిండియా టార్గెట్ ఎంత అంటే..?
ABN, First Publish Date - 2023-09-27T17:32:21+05:30
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 56, మిచెల్ మార్ష్ 96 పరుగులతో అదరగొట్టారు. అనంతరం స్టీవెన్ స్మిత్ 74, లబుషేన్ 72 పరుగులు చేశారు.
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 56, మిచెల్ మార్ష్ 96 పరుగులతో అదరగొట్టారు. అనంతరం స్టీవెన్ స్మిత్ 74, లబుషేన్ 72 పరుగులు చేశారు. ఒకదశలో ఆస్ట్రేలియా స్కోరు 400 పరుగులు దాటుతుందని అభిమానులు భావించారు. అయితే మిడిలార్డర్ మాత్రం అంచనాల మేరకు రాణించలేదు. దీంతో 352 పరుగులకే ఆసీస్ పరిమితం అయ్యింది.
ఇది కూడా చదవండి: IND vs AUS 3rd ODI: స్టీవెన్ స్మిత్ ఖాతాలో అరుదైన రికార్డు
టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటుకున్నాడు. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 353 పరుగులు చేయాలి. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే క్వీన్ స్వీప్ సాధించనుంది. రాజ్‌కోట్ వన్డేకు రోహిత్, కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు అందుబాటులోకి రావడంతో టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలవాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Updated Date - 2023-09-27T17:32:21+05:30 IST