Team India: భారత్‌పైనా బజ్‌బాల్ వ్యూహం.. స్టోక్స్ ఏమన్నాడంటే..?
ABN, First Publish Date - 2023-08-01T18:26:34+05:30
ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్.. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 18 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై బజ్‌బాల్ గేమ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. 3-0తో ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇదే బజ్‌బాల్ గేమ్‌తో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ గడ్డపైనా మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది. తాజాగా యాషెస్ సిరీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను 2-2తో ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియాపైనా ఇంగ్లండ్ బజ్ బాల్ వ్యూహాన్నే అనుసరిస్తుందని అందరూ భావిస్తున్నారు.
టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ దూకుడు మంత్రం తపిస్తోంది. దీంతో ఆ జట్టు మెరుగైన ఫలితాలను రాబడుతోంది. కానీ యాషెస్ సిరీస్ ప్రారంభంలో బజ్‌బాల్ వ్యూహంపై విమర్శలు చెలరేగాయి. ఇంగ్లండ్ వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడంతో అందరూ ఆ జట్టు నిర్ణయాలను తప్పుబట్టారు. అగ్రశ్రేణి జట్లపై బజ్ బాల్ వ్యూహం పనికిరాదని హితవు పలికారు. కానీ ఇంగ్లండ్ మాత్రం బజ్ బాల్ వ్యూహాన్ని వదిలిపెట్టలేదు.
ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్.. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 18 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై బజ్‌బాల్ గేమ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. 3-0తో ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇదే బజ్‌బాల్ గేమ్‌తో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ గడ్డపైనా మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది. తాజాగా యాషెస్ సిరీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను 2-2తో ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియాపైనా ఇంగ్లండ్ బజ్ బాల్ వ్యూహాన్నే అనుసరిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ అంశంపై యాషెస్ సిరీస్ ముగిశాక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు.
ఇది కూడా చదవండి: Ashes Series: నైతిక విజయం ఇంగ్లండ్‌దే.. ఎందుకంటే..?
'మేం న్యూజిలాండ్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేశాం. అప్పుడు ఇదే అప్రోచ్‌తో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియాలను ఓడిస్తామని అనుకోలేదు. భారత్‌పై కూడా ఇదే జోరు కొనసాగిస్తామని ఎవరికి తెలుసు. దీనికి కాలమే సమాధానం చెబుతోంది' అని బెన్ స్టోక్స్ తెలిపాడు. అన్నీ జట్లను ఓడించినట్లే భారత్‌ను కూడా బజ్‌బాల్‌తో మట్టికరిపిస్తామని అతడు పరోక్షంగా హెచ్చరించాడు. కాగా టీమిండియా గడ్డపై 2012-13లో చివరిసారిగా విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆ తర్వాత రెండు సార్లు 4-0, 3-1తో ఓటమిపాలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌కు హైదరాబాద్, విశాఖతో పాటు రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికలను ఖరారు చేశారు. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఈ సిరీస్ జరగనుంది.
Updated Date - 2023-08-01T18:26:34+05:30 IST