ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ben Stokes: ఇంత ఫైర్ ఉన్నోడివి.. ఎందుకు రిటైర్ అయ్యావు?

ABN, First Publish Date - 2023-09-14T18:32:15+05:30

బెన్ స్టోక్స్ గతంలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో రాణించేందుకు వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

వన్డే ప్రపంచకప్‌కు ఇంకా నెల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని జట్లు వన్డేలపై దృష్టి సారించాయి. దాదాపు అన్ని ప్రధాన జట్లు వన్డేలు ఆడుతున్నాయి. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతుండగా.. మరోవైపు ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ఐదు వన్డేల సిరీస్, న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య నాలుగు వన్డేల సిరీస్ జరుగుతున్నాయి. అయితే ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి రెండు వన్డేల్లో చెరొకటి గెలవగా.. మూడో వన్డేలో మాత్రం ఇంగ్లండ్ దంచికొట్టింది. ముఖ్యంగా బెన్ స్టోక్స్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులు సాధించాడు. దీంతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఇది కూడా చదవండి: Jio Cinema: క్రికెట్ అభిమానులకు మళ్లీ గుడ్‌న్యూస్.. ఆ సిరీస్ కూడా ఉచితంగా స్ట్రీమింగ్

అయితే బెన్ స్టోక్స్ గతంలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో రాణించేందుకు వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. కానీ త్వరలో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం ఈసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరింది. దీంతో రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడంతో అతడిని సెలక్టర్లు వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించారు. అంతేకాకుండా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో అతడి ఆటతీరు చూసి ఇంత ఫైర్ పెట్టుకుని వన్డేలకు ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చావని స్టోక్స్‌ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

కాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో బెన్ స్టోక్స్ నాలుగో స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేశాడు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా స్టోక్స్ రికార్డు సాధించాడు. వివియన్ రిచర్డ్స్ 189 పరుగులు చేయగా స్టోక్స్ 182 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు నాన్ ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా స్టోక్స్ రికార్డుల్లోకి ఎక్కాడు. కోవంట్రీ (194), వివియన్ రిచర్డ్స్ (189), డుప్లెసిస్ (185), మహేంద్ర సింగ్ ధోనీ (183), విరాట్ కోహ్లీ (183) ఈ జాబితాలో ముందున్నారు.

Updated Date - 2023-09-14T18:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising