ODI World Cup: ఆస్ట్రేలియాకు అనుకూలంగా పెళ్లిళ్ల సెంటిమెంట్... వామ్మో అంటున్న టీమిండియా ఫ్యాన్స్
ABN, First Publish Date - 2023-11-18T21:09:03+05:30
Marriage Sentiment: ప్రపంచకప్ ఫైనల్‌కు పెళ్లిళ్లతో ముడిపెట్టిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకున్న కెప్టెన్‌లు మరుసటి ఏడాదే ప్రపంచకప్‌లను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది పెళ్లి చేసుకున్న కెప్టెన్ ఈ ఏడాది ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023లో ఎదురులేని ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. అసలు సిసలు సమరానికి సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా టీమిండియా ప్రయాణం కొనసాగితే.. తొలి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన ఆసీస్.. అనూహ్య ప్రదర్శనతో వరుసగా 8 విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. అయితే ప్రపంచకప్ ఫైనల్‌కు పెళ్లిళ్లతో ముడిపెట్టిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకున్న కెప్టెన్‌లు మరుసటి ఏడాదే ప్రపంచకప్‌లను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది పెళ్లి చేసుకున్న కెప్టెన్ ఈ ఏడాది ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. 2002లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ పెళ్లి చేసుకోగా 2003లో ప్రపంచకప్ ట్రోఫీ అందుకున్నాడు. 2010లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వివాహం చేసుకోగా 2011లో తన జట్టును సగర్వంగా విశ్వవిజేతగా నిలిపాడు. ఈ సెంటిమెంట్ ఇక్కడితో ఆగకుండా కంటిన్యూ అయ్యింది. 2018లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వివాహం చేసుకుని 2019లో తన జట్టును ఫైనల్లో గెలిపించి ట్రోఫీని అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా 2022లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పెళ్లి చేసుకోగా ఈ ఏడాది ఆస్ట్రేలియాకు కప్ అందిస్తాడని ఆస్ట్రేలియా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీంతో టీమిండియా అభిమానుల్లో టెన్షన్ మరింత పెరిగింది. ఈ సెంటిమెంట్‌కు రోహిత్ శర్మ బ్రేక్ వేసి తొలిసారి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-18T21:10:30+05:30 IST