ODI World Cup: అంపైర్ కెటిల్ బరో నిర్ణయంపై వివాదం.. వైడ్ ఎందుకు ఇవ్వలేదు?
ABN, First Publish Date - 2023-10-20T16:54:32+05:30
బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడిన మ్యాచ్‌లో అంపైర్ కెటిల్ బరో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కోహ్లీ సెంచరీ చేయడానికి అంపైర్ కెటిల్ బరో సహకరించాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడిన మ్యాచ్‌లో అంపైర్ కెటిల్ బరో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా 42వ ఓవర్ వేయడానికి బంగ్లాదేశ్ బౌలర్ నాసుమ్ అహ్మద్ వచ్చాడు. అతడు తన బాల్‌ను కోహ్లీకి లెగ్ సైడ్ సంధించాడు. అది కోహ్లీ కాళ్ల వెనుక నుంచి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఇది వైడ్ డెలివరీ అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అంపైర్ కెటిల్ బరో వైడ్ ఇవ్వకపోవడంతో వీక్షకులందరూ ఆశ్చర్యపోయారు. విరాట్ కోహ్లీ కూడా ఇది వైడ్ డెలివరీ అనే భావించి నాసుమ్ అహ్మద్ వైపు సీరియస్‌గా చూసి చికాకు వ్యక్తం చేశాడు. దీంతో కోహ్లీ సెంచరీ చేయడానికి అంపైర్ కెటిల్ బరో సహకరించాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Shubman Gill: సారాతో మళ్లీ చిగురించిన ప్రేమాయణం.. ఇవే సాక్ష్యాలు..!!
ఉద్దేశపూర్వకంగానే నసుమ్ వైడ్ వేశాడని భావించిన అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో తన నిర్ణయాన్ని ప్రకటించలేదని కొందరు భావిస్తుంటే.. ఆటగాళ్లకు ఉండే క్రీడా స్పూర్తి అంపైర్లకు వర్తించదా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ నిజానికి అది వైడ్ బాల్ కాదని కొందరు ఫోటోలతో సహా స్పష్టం చేస్తున్నారు. బాల్ పడిన తర్వాత అది కోహ్లీ కాలిని తాకిందని వివరిస్తున్నారు. అందుకే అంపైర్ వైడ్ ఇవ్వలేదని.. ఈ మాత్రానికే అంపైర్‌పై విమర్శలు తగవని హితవు పలుకుతున్నారు. ఒకవేళ అంపైర్ ఆ బాల్‌ను వైడ్‌గా ఇచ్చినా ఇంకా ఒక రన్ కొట్టాలని.. అప్పుడు సిక్స్ కొట్టినా సరిపోయేది కదా అని సమర్ధిస్తున్నారు. మరోవైపు ప్రముఖ కార్ల కంపెనీ మోరిస్ గ్యారేజెస్ (ఎంజీ) తనదైన శైలిలో వెటకారం ఆడింది. ఇందులో భాగంగా సదరు అంపైర్ కెటిల్ బరోకు తమ ఎంజీ కారును బహుమతిగా ఇవ్వాలేమో అని ఫైనాన్స్ వాళ్లతో చర్చిస్తున్నాం అంటూ వ్యంగంగా ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - 2023-10-20T16:54:32+05:30 IST