ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cricket News: ప్రపంచకప్ జట్టులో ట్రాన్స్‌జెండర్.. చరిత్రలో ఇదే తొలిసారి

ABN, First Publish Date - 2023-09-01T20:03:57+05:30

ట్రాన్స్‌జెండర్ల కోసం హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో కెనడా అంతర్జాతీయ టీ20 జట్టులో ట్రాన్స్‌జెండర్ చోటు దక్కించుకుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌గా మెక్‌గాహే రికార్డు సృష్టించబోతోంది.

వచ్చే ఏడాది టీ20 మహిళల ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో త్వరలో క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో కెనడా జట్టు తమ స్క్వాడ్‌ను ప్రకటించగా అందులో ట్రాన్స్‌జెండర్ చోటు దక్కించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఓ జట్టులో ట్రాన్స్‌జెండర్ స్థానం సంపాదించారు. 29 ఏళ్ల మెక్‌గాహే అనే ట్రాన్స్‌జెండర్‌ను సెలక్టర్లు కెనడా మహిళల టీ20 జట్టు కోసం సెలక్ట్ చేశారు. నిజానికి మెక్‌గాహే ఆస్ట్రేలియాకు చెందిన బ్యాటర్. కానీ 2020లో కెనడాకు వలస వెళ్లాల్సి వచ్చింది.

బీబీసీ స్పోర్ట్స్ కథనం ప్రకారం 2020లో మెక్‌గాహే మగవాడి నుంచి ఆడ వ్యక్తిగా లింగమార్పిడి చేయించుకున్నాడు. 2021లో కెనడా తరఫున క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నూతనంగా తెచ్చిన నిబంధనలు, ప్రమాణాల ప్రకారం మెక్‌గాహేను సెలక్టర్లు ఎంపిక చేశారు. మరోవైపు ఐసీసీ ప్లేయర్ ఎలిజిబిలిటీ నిబంధనల ప్రకారం ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు కెనడా సెలక్టర్లు తెలిపారు. MTF లింగమార్పిడి నిబంధనల ప్రాతిపదికన మెక్‌గాహే అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో పాల్గొనేందుకు అర్హురాలిగా భావించబడినట్లు వివరించారు. అటు అంతర్జాతీయ స్థాయిలో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌గా ఆడటం తనకు పూర్తిగా గౌరవం ఇస్తుందని మెక్‌గాహే అభిప్రాయపడింది. తన కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తానని కలలో కూడా ఊహించలేదని తెలిపింది. ఐసీసీకి తన మెడికల్ సమాచారాన్ని పంపించి అన్ని విధాలుగా సాయం చేసిన తన వైద్యులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది.

ఇది కూడా చదవండి: Chess Ranks: చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. 37 ఏళ్ల తర్వాత రికార్డు బ్రేక్

గత అక్టోబర్‌లో బ్రెజిల్‌లో జరిగిన సౌత్ అమెరికన్ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో కెనడా తరపున మెక్‌గాహే నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అందులో కెనడా విజయం సాధించింది. అయితే ఆ పోటీలకు అంతర్జాతీయ హోదా లేదు. కాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో ఆతిథ్య అమెరికాతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా తలపడనున్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే.. అమెరికాస్ క్వాలిఫైయర్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు గ్లోబల్ క్వాలిఫైయర్ జట్లతో మరోసారి తలపడాల్సి ఉంటుంది.

Updated Date - 2023-09-01T20:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising