ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup 2023: ఇది ప్రపంచకప్ మ్యాచేనా..? ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న మోదీ స్టేడియం

ABN, First Publish Date - 2023-10-05T14:59:44+05:30

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచకప్ మ్యాచ్.. అది కూడా తొలి మ్యాచ్‌కు ఆదరణ లేకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వన్డే ప్రపంచకప్ మహాసంగ్రామం ఎలాంటి చడీచప్పుడు లేకుండా ప్రారంభమైంది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఎలాంటి ప్రారంభ వేడుకలను నిర్వహించలేదు. అంతేకాకుండా గత ప్రపంచకప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌కు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచకప్ మ్యాచ్.. అది కూడా తొలి మ్యాచ్‌కు ఆదరణ లేకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు నరేంద్ర మోదీ స్టేడియం హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే ఇది వన్డే మ్యాచ్ కావడంతో సాయంత్రం నుంచి ప్రేక్షకులు స్టేడియానికి వచ్చే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: World Cup: క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన బీసీసీఐ.. ఈ సారి వరల్డ్ కప్‌లో ఆ హంగామా మిస్!


అటు ప్రపంచకప్‌లో మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు బీసీసీఐ సెక్రటరీ జైషా శుభవార్త అందించారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసి ఆటగాళ్లకు మద్దతు ఇచ్చేందుకు ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారని.. అలాంటి వాళ్లకు గతంలో ప్రకటించిన విధంగా మినరల్ వాటర్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను ఉచితంగా అందిస్తామని వివరించారు. తాగునీరు కోసం ప్రత్యేకంగా అభిమానులు డబ్బులు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ చప్పగా జరుగుతోంది. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం అభిమానులను నిరాశపరిచింది. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఇంగ్లండ్ మాత్రం 4 మ్యాచ్‌లలో గెలిచి కివీస్‌పై ఆధిపత్యం చెలాయిస్తోంది.

Updated Date - 2023-10-05T15:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising