ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ENG Vs SL: 33.2 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ABN, First Publish Date - 2023-10-26T17:09:15+05:30

బెంగళూరు వేదికగా శ్రీలంతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కేవలం 33.2 ఓవర్లు మాత్రమే ఆడి 156 పరుగులకు ఆలౌటైంది.

ఈ వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు చేతులెత్తేసింది. బెంగళూరు వేదికగా శ్రీలంతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కేవలం 33.2 ఓవర్లు మాత్రమే ఆడి 156 పరుగులకు ఆలౌటైంది. తొలి వికెట్‌కు నమోదైన 45 పరుగుల బాగస్వా్మ్యమే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో అత్యధికం. స్టోక్స్ (43), బెయిర్ స్టో (30), మలాన్ (28), మొయిన్ అలీ (15), డేవిడ్ విల్లీ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. రూట్ (3), బట్లర్ (8), లివింగ్ స్టోన్ (1) దారుణంగా నిరాశపరిచారు.

కాగా శ్రీలంక బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. లహిరు కుమార 3 వికెట్లు తీయగా, ఏంజిలో మాథ్యూస్ 2, కాసున్ రజిత 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఏంజిలో మాథ్యూస్ 5 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అటు చివరి నాలుగు వన్డే ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్‌పై శ్రీలంక గెలవడం గమనించాల్సిన విషయం. 2007, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్‌పై శ్రీలంక గెలిచింది. ఇప్పుడు మరోసారి గెలిచేందుకు బాటలు పరుచుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే 157 పరుగులు చేయాల్సి ఉంది.

Updated Date - 2023-10-26T17:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising