World Cup Records: ఇంగ్లండ్ చెత్త రికార్డు.. టెస్టులాడే అన్ని జట్లపై ఓడిన ఏకైక జట్టు
ABN, First Publish Date - 2023-10-16T15:28:01+05:30
ఇంగ్లండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో టెస్టులు ఆడే అన్ని జట్లపైనా ఓడిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.
2023 వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆప్ఘనిస్తాన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 69 పరుగుల తేడాతో ఓడించి సంచలన విజయం సాధించింది. అయితే ఈ ఫలితంతో ఇంగ్లండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో టెస్టులు ఆడే అన్ని జట్లపైనా ఓడిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ప్రస్తుతం ఐసీసీ కింద మొత్తం 12 జట్లు టెస్టులు ఆడుతున్నాయి. ఈ జాబితాలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, జింబాబ్వే, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. వీటిలో ఇంగ్లండ్ జట్టు మిగతా 11 జట్లపై ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లో ఓటమి చవిచూసింది.
ఇది కూడా చదవండి: ODI World Cup: ప్రపంచకప్‌లో ఆసియా జట్ల రికార్డులు.. అన్నీ క్లీన్‌స్వీప్‌లే..!!
1975 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై తొలిసారిగా ఇంగ్లండ్ ఓటమి రుచి చూసింది. 1979లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్‌పై ఓడిపోయిన ఇంగ్లండ్.. 1983, 1987లో ఆసియా దిగ్గజాలు భారత్, పాకిస్థాన్‌లపైనా వరుసగా పరాజయాలు చవిచూసింది. 1983లోనే న్యూజిలాండ్ చేతిలోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. ఇక 1992లో అప్పుడు క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న జింబాబ్వే చేతిలోనూ ఇంగ్లండ్ పరాజయం పాలైంది. 1996లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపైనా ఇంగ్లండ్ ఓడిపోయింది. 2011లో అయితే బంగ్లాదేశ్, ఐర్లాండ్ వంటి పసికూనలు ఇంగ్లండ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాయి. తాజా ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్ కూడా ఇంగ్లండ్‌పై గెలిచి చరిత్ర సృష్టించింది.
Updated Date - 2023-10-16T15:28:01+05:30 IST