ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: మెగా టోర్నీని ఓటమితో ముగించిన పాకిస్థాన్..!!

ABN, First Publish Date - 2023-11-11T22:03:37+05:30

Pakistan: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. తప్పకుండా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటతీరు నిరాశపరిచింది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 8 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది.

వన్డే ప్రపంచకప్‌ను పాకిస్థాన్ ఓటమితో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. తప్పకుండా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటతీరు నిరాశపరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84), జో రూట్(72 బంతుల్లో 4 ఫోర్లతో 60), జానీ బెయిర్‌స్టో (61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో పాకిస్థాన్ ముందు 338 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.

అయితే పాకిస్థాన్‌కు ప్రారంభంలోనే ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ షాకిచ్చాడు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీఖ్ (0), ఫకార్ జమాన్ (1)లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. బాబర్ ఆజమ్ (38), మహ్మద్ రిజ్వాన్ (36) రాణించినా వేగంగా ఆడలేకపోయారు. అఘా సల్మాన్ (51) హాఫ్ సెంచరీతో రాణించినా పాకిస్తాన్ పరాజయం మాత్రం అప్పటికే ఖరారైంది. చివర్లో షాహిన్ షా అఫ్రిది (25), మహ్మద్ వసీమ్ (16), హరీస్ రౌఫ్ (35) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినా ఓటమి అంతరం తగ్గింది కానీ విజయం మాత్రం దక్కలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లీకి 3 వికెట్లు, రషీద్ 2 వికెట్లు, అట్కిన్సన్ 2 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 8 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో భాగంగా పాయింట్ల పట్టికలో టాప్-1, టాప్-10 జట్లు తలపడనున్నాయి.

Updated Date - 2023-11-11T22:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising