ODI World Cup: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్
ABN, First Publish Date - 2023-10-26T14:11:08+05:30
వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2023 వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌కు చావో రేవో లాంటి పరిస్థితి. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో ఓడి కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. దీంతో ఇకపై అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే సెమీస్ రేసులో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టిన ఇంగ్లీష్ టీమ్.. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను తీసుకుంది. గాయంతో టోర్నీకి దూరమైన రాస్ టోప్లీ స్థానంలో డేవిడ్ విల్లీని తీసుకుంది. అట్కిన్సన్ స్థానంలో క్రిస్ వోక్స్‌ను తీసుకుంది.
ఇది కూడా చదవండి: World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు చావో రేవో.. నేడు ఓడితే ఇక ఇంటికే!..
అటు శ్రీలంక కూడా గత మ్యాచ్‌తో పోలిస్తే ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. చమిక కరుణరత్నే స్థానంలో సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను తుది జట్టులోకి తీసుకుంది. శ్రీలంక కూడా సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌తో తప్పకుండా గెలవాలి. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో శ్రీలంక కూడా అలాంటి పొజిషన్లోనే ఉంది. ఇంగ్లండ్ మాదిరిగానే శ్రీలంక కూడా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచి మిగతా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్ పరంగా చూసుకుంటే శ్రీలంకతో పోలిస్తే ఇంగ్లండ్ మాత్రమే ఫేవరెట్‌గా దిగుతోంది. కానీ శ్రీలంకను తక్కువ అంచనా వేస్తే ఇంగ్లండ్ మరోసారి షాక్ తినాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. వన్డే ప్రపంచకప్‌లలో ఇరు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లలో తలపడగా.. ఆరు మ్యాచ్‌లలో ఇంగ్లండ్, ఐదు మ్యాచ్‌లలో శ్రీలంక విజయం సాధించాయి.
Updated Date - 2023-10-26T14:11:08+05:30 IST