ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rohit Sharma: హై..హై.. నాయకా!.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు జల్లు

ABN, First Publish Date - 2023-11-17T03:36:53+05:30

రోహిత్‌ను ఇంగ్లండ్‌ మాజీ సారథి నాసిర్‌ హుస్సేన్‌ ఆకాశానికెత్తేశాడు. ఈ వరల్డ్‌ కప్‌లో బెరుకులేని క్రికెట్‌ ఆడుతూ జట్టు సంస్కృతిని సమూలంగా మార్చి వేసిన రోహిత్‌ను రియల్‌ హీరోగా కొనియాడాడు...

రోహిత్‌ను ఇంగ్లండ్‌ మాజీ సారథి నాసిర్‌ హుస్సేన్‌ ఆకాశానికెత్తేశాడు. ఈ వరల్డ్‌ కప్‌లో బెరుకులేని క్రికెట్‌ ఆడుతూ జట్టు సంస్కృతిని సమూలంగా మార్చి వేసిన రోహిత్‌ను రియల్‌ హీరోగా కొనియాడాడు. ‘సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్‌ సాధించిన విజయానికి సంబంధించి సెంచరీ హీరోలు కోహ్లీ, శ్రేయాస్‌, ఏడు వికెట్లతో చెలరేగిన షమిని అంతా కీర్తిస్తుండవచ్చు. కానీ టీమిండియా ఆట తీరును ప్రక్షాళించిన నిజమైన హీరో మాత్రం రోహిత్‌ శర్మే’ అని హుస్సేన్‌ స్పష్టంజేశాడు.

ఈ వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్న తీరు అద్భుతం. ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు మెరుపు ఆరంభం ఇస్తున్నాడు. ఈ క్రమంలో అతడు వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఏమాత్రం చూసుకోవడం లేదు. అలా మైలురాళ్లకోసం చూసుకొనివుంటే ఈసారి మెగా టోర్నీలో రోహిత్‌ ఎంత లేదన్నా ఐదు శతకాలు తన ఖాతాలో వేసుకొనేవాడు. కానీ తన ఆట తీరుతో కోట్లాది మంది హృదయాలను అతడు గెలుచుకున్నాడు. అమోఘ సారథ్యంతో జట్టును ఫైనల్‌కు చేర్చిన హిట్‌మ్యాన్‌కు..19న జరిగే తుది పోరునాటికి 36 సంవత్సరాల 203 రోజులు నిండుతాయి. తదుపరి ప్రపంచ కప్‌ నాటికి అతడికి 40 ఏళ్లు దాటతాయి. అంటే..వచ్చే వన్డే వరల్డ్‌ కప్‌ ఆడే అవకాశాలు రోహిత్‌కు దాదాపు లేనట్టే. ఈనేపథ్యంలో ఈసారి ప్రతిష్ఠాత్మక కప్‌ అందుకొని అటు క్రికెటర్‌గా, ఇటు సారథిగా తన కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకొనేందుకు రోహిత్‌కు ఇంతకుమించిన తరుణం ఉండబోదు.


‘రాబోయే రెండు నెలల్లో ఈ జట్టుతో కలిసి నేను ఎన్నో మధురానుభూతులు పంచుకోవాలనుకుంటున్నా’ అని ఆసియా కప్‌ వన్డే టోర్నీకి ముందు రోహిత్‌ చెప్పాడు. అందుకనుగుణంగానే.. లీగ్‌ దశ తొమ్మిది మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్లో సాధించిన విజయంతో ఆ మధురానుభూతులను ఆస్వాదిస్తున్నాడు. ఆ అనుభూతుల అంతిమ దశను ఆస్వాదించాలంటే మరొక్క విజయం అతడికి కావాలి. గత ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి చవిచూశాక రోహిత్‌ ఏమన్నాడో తెలుసా..‘మా దృక్పథంలో మార్పు రావాలి’ అని. దృక్పథంలో వచ్చే మార్పు..మానసికంగా ఎంతో ప్రభావం చూపుతుంది. సారథి దృక్పథంలో వచ్చే మార్పు జట్టు సహచరులలోనూ ప్రతిఫలిస్తుంది. పైగా ఏ పనినైనా తాను చేసి..ఇతరులూ చేయాలనేది రోహిత్‌ తత్వం. అంతేకానీ తాను ఆచరించకుండా ఇతరులు ఆ పనిని చేయాలని అతడు ఆదేశించడు. మొత్తంగా..పొట్టి ప్రపంచ కప్‌ తర్వాత జట్టు ఆట తీరులో మార్పు రావాలని అభిప్రాయపడిన రోహిత్‌..దానిని ఆచరించి చూపాడు. కెప్టెన్‌గా జట్టుకు శుభారంభాలు ఇస్తూ..దానిని ఇతరులు కొనసాగించేలా మార్గదర్శనం చేస్తున్నాడు. ప్రతిభ కలిగిన ఆటగాడికి అండగా నిలవడంలో రోహిత్‌ ఎంతో ముందుంటాడు. ‘లీగ్‌ దశ ఆరంభంలో విఫలమై నేను ఎంతో ఒత్తిడికి గురయ్యా. ఆ సమయంలో కెప్టెన్‌ మద్దతు అత్యంత కీలకం. జట్టు యాజమాన్యం నీతో ఉంది. బయట ఎవరు ఏమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దని రోహిత్‌ నా వెన్ను తట్టాడు’ అని టోర్నీలో తాను వరుస సెంచరీలతో చెలరేగడం వెనుక సారథిగా రోహిత్‌ పాత్రను గుర్తు చేస్తూ శ్రేయాస్‌ అయ్యర్‌ వెల్లడించాడు. న్యూజిలాండ్‌పై సెమీఫైనల్లో విజయం అనంతరం రోహిత్‌ గాల్లోకి ఎగిరి గెంతిన దృశ్యం ఆసియా కప్‌ అనంతరం అతడు చెప్పిన ‘మధురానుభూతి’లో ఒకటి. అది పరిపూర్ణం కావాలంటే జట్టు సహచరులంతా ఇదే అద్భుత, సమష్టి ప్రదర్శనతో ఫైనల్లో గెలిచి వరల్డ్‌ కప్‌ కెప్టెన్‌ రోహిత్‌కు కానుకగా ఇవ్వడమే.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఫైనల్‌

భారత్‌ X ఆస్ట్రేలియా

ఆదివారం మ.2 నుంచి

(వేదిక: అహ్మదాబాద్‌)

Updated Date - 2023-11-17T10:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising