Hardik Pandya: అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు కూడా హార్దిక్ దూరం.. మరి ఐపీఎల్ సంగతేంటి?
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:50 AM
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా ఎప్పుడూ కోలుకుంటాడనే అంశంపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. వచ్చే నెలలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ నాటికి హార్దిక్ పాండ్యా కోలుకుంటాడని అంతా భావించారు.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా ఎప్పుడూ కోలుకుంటాడనే అంశంపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. వచ్చే నెలలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్ నాటికి హార్దిక్ పాండ్యా కోలుకుంటాడని అంతా భావించారు. ఆ సిరీస్‌కు అతనే కెప్టెన్‌గా ఉంటాడని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. పలు నివేదికల ప్రకారం అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ నాటికి హార్దిక్ పాండ్యా కోలుకునే అవకాశాలు లేవు. దీంతో ఆ సిరీస్‌కు కూడా హార్దిక్ దూరం కానున్నాడు. కానీ ఆ తర్వాత జరిగే ఐపీఎల్ నాటికి హార్దిక్ పాండ్యా కోలుకుంటాడని, ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. హార్దిక్ టీమిండియా కంటే ఐపీఎల్ మ్యాచ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడని విమర్శిస్తున్నారు.
గతంలో కూడా గాయం కారణంగా కొంత కాలం భారత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో మాత్రం ఆడాడని అంటున్నారు. కాగా నిన్నమొన్నటి వరకు గాయం నుంచి హార్దిక్ పాండ్యా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌తోపాటు రానున్న ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరంగా ఉంటాడనే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు మాత్రమే హార్దిక్ దూరం కానున్నాడని సమాచారం అందుతోంది. కాగా ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో చీలమండ గాయం కారణంగా మిగతా టోర్నీకి హార్దిక్ పాండ్యా దూరం అయ్యాడు. అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో హార్దిక్ పాండ్యా గాయంపై ఆందోళన నెలకొంది. హార్దిక్ వీలైనంత త్వరగా కోలుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
Updated Date - Dec 28 , 2023 | 11:50 AM