ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: విరాట్ కోహ్లీకి మరో గౌరవం.. ఈ శతాబ్దంలోనే అది అత్యుత్తమ షాట్‌

ABN, First Publish Date - 2023-11-08T15:19:36+05:30

Shot Of The Century: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆధిపత్యం కొనసాగుతోంది. ఇటీవల క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ.. త్వరలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించబోతున్నాడు. ఇంతలోనే విరాట్ కోహ్లీకి ఐసీసీ మరో అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ బౌలర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ ఆడిన సిక్సర్ షాట్‌ను ఈ శతాబ్దంలోనే అత్యుత్తమంగా ఐసీసీ పేర్కొంది.

గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ నిర్వహించింది. ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అభిమానుల్లో అత్యంత ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. దీంతో 160 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి ఖాయమని అభిమానులు భావించారు. అయితే అప్పుడే మిరాకిల్ చోటు చేసుకుంది. కోహ్లీ క్రీజులో ఉండి తానొక్కడే ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో అందరిలోనూ మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్రికెటర్ అయినా ఒత్తిడికి లోను కావడం సహజమే. కానీ ఛేదనలో కింగ్ విరాట్ కోహ్లీ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. 19వ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టాడు. పాకిస్థాన్ బౌలర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో బాడీని బ్యాలెన్స్ చేస్తూ లాంగాన్ మీదుగా కోహ్లీ కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

దీంతో టీమిండియా విజయ సమీకరణం చివరి ఓవర్లో 16 పరుగులుగా మారింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా క్రికెట్‌లో ఎంతో మంది క్రికెటర్ వినూత్న షాట్‌లు ఆడినా ఐసీసీ మాత్రం తాజాగా విరాట్ కోహ్లీ కొట్టిన షాట్‌ను ఈ శతాబ్దపు అత్యుత్తమ షాట్‌గా వెల్లడించింది. ఇటీవల బర్త్ డే జరుపుకున్న కోహ్లీ తన అభిమానులకు 49వ సెంచరీని కానుకగా ఇవ్వగా.. ఇప్పుడు కోహ్లీకి ఐసీసీ కానుక ప్రకటించినట్లు అయ్యిందని అభిమానులు చర్చించుకుంటున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-08T15:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising