ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs PAK మ్యాచ్‌ జరుగుతుండగా మహిళా పోలీస్, ప్రేక్షకుడి మధ్య ఫైటింగ్.. వైరల్ వీడియో!

ABN, First Publish Date - 2023-10-15T15:40:57+05:30

శనివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన దాయాదుల పోరులో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో పాకిస్థాన్ తేలిపోయింది. టీమిండియాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది.

అహ్మదాబాద్: శనివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన దాయాదుల పోరులో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో పాకిస్థాన్ తేలిపోయింది. టీమిండియాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. దీంతో వన్ సైడేడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే మ్యాచ్ జరుగుతుండగా మహిళా పోలీస్ అధికారిణికి, ఓ ప్రేక్షకుడికి జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్నదాని ప్రకారం మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు స్టేడియంలోని స్టాండ్స్‌లో ఓ సీటులో కూర్చున్నాడు. అక్కడే ఓ మహిళా పోలీస్ అధికారిణి తన విధులను నిర్వర్తిస్తుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ పోలీస్ అధికారిణి, ఆ యువకుడి మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇంతలోనే వారిద్దరు సహనం కోల్పోయారు. మొదటి ఆ పోలీస్ అధికారిణి యువకుడి చెంప పగలగొట్టింది. వెంటనే ఆ యువకుడు కూడా మహిళా పోలీస్ అధికారిణిపై చేయి చేసుకున్నాడు. దీంతో వారిద్దరు మధ్య మాటల యుద్ధం మరింత పెరగడం మనం వీడియోలో చూడచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌ విభాగాల్లో రాణిస్తూ శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86) నుంచి మరో కీలక ఇన్నింగ్స్‌ రాగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. తాజా టోర్నీలో హ్యాట్రిక్‌ కొట్టిన భారత్‌ అటు పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. బాబర్‌ ఆజమ్‌ (50), రిజ్వాన్‌ (49), ఇమామ్‌ ఉల్‌ హక్‌ (36) మాత్రమే రాణించారు. బుమ్రా, హార్దిక్‌, కుల్దీప్‌, జడేజా, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్‌ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. షహీన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.

Updated Date - 2023-10-15T15:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising