ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Pakistan: టాటా.. బైబై.. పాక్ ఓపెనర్‌ను ఔట్ చేశాక హార్దిక్ పాండ్యా చేష్టలు వైరల్!

ABN, First Publish Date - 2023-10-15T11:09:26+05:30

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా తమ అధిపత్యాన్ని కొనసాగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది.

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా తమ అధిపత్యాన్ని కొనసాగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. రోహిత్ శర్మ మరోసారి తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 6 ఫోర్లు, 6 సిక్సులతో 63 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేష్టలు వైరల్‌గా మారాయి. 13వ ఓవర్ మూడో బంతికి పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను హార్దిక్ పెవిలియన్ చేర్చాడు. హర్దిక్ బౌలింగ్‌లో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి 36 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్ ఔటయ్యాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా చేసిన చేష్టలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ బంతి వేయడానికి ముందు హార్దిక్ పాండ్యా దేవుడికి మొక్కుకోవడం వైరలైన ఫోటోల్లో కనిపించింది. ఆ తర్వాతి బంతికే ఇమామ్ ఉల్ హక్ ఔటయ్యాడు. దీంతో అతను క్రీజు వదిలి వెళ్లిపోతుంటే హార్దిక్ పాండ్యా అతనికి టాటా.. బైబై అన్నట్టుగా చేతి సైగలు చేశాడు. ‘‘వచ్చిందుకు ధన్యవాదాలు.. ఇక వెళ్లు.. బైబై’’ అని ఇమామ్ ఉల్ హక్‌కు హార్దిక్ సైగలు చేశాడని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అలాగే బాల్ వేయడానికి ముందు హార్దిక్ దేవుడికి మొక్కుకోవడాన్ని గమనించిన పలువురు ఇమామ్ ఉల్ హక్‌ను ఔట్ చేయడానికి ఏదో మంత్రం వేశాడని అంటున్నారు. ఆ మంత్రం ఫలితంగానే వికెట్ లభించిందని ఫన్నీగా రాసుకొస్తున్నారు. మొత్తంగా ఇందుకు సంబంధిచిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక ఈ మ్యాచ్‌లో 6 ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 34 పరుగలు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు.

Updated Date - 2023-10-15T11:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising