ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND Vs AUS: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. రేపటి నుంచే టిక్కెట్ విక్రయాలు

ABN, First Publish Date - 2023-11-14T14:22:16+05:30

వన్డే ప్రపంచకప్ పూర్తి కాగానే టీమిండియా బిజిబిజీగా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈనెల 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ మన ఏపీలోనే జరగనుంది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ టిక్కెట్లను ఈనెల 15 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.

వన్డే ప్రపంచకప్‌ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం అందిస్తోంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. విశ్వవిజేత ఎవరో తెలియాలంటే మరో మూడు మ్యాచ్‌ల వరకు ఆగాలి. అయితే వన్డే ప్రపంచకప్ పూర్తి కాగానే టీమిండియా బిజిబిజీగా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈనెల 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ మన ఏపీలోనే జరగనుంది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ టిక్కెట్లను ఈనెల 15, 16 తేదీల్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. పేటీఎం ఇన్‌సైడర్ డాట్ ఇన్ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తామని వెల్లడించింది.

మరోవైపు ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ భారత్-ఆస్ట్రేలియా టిక్కెట్లు విక్రయించనున్నారు. ఈనెల 17, 18న విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆఫ్‌లైన్ టిక్కెట్లను విక్రయిస్తారు. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500, రూ.6000 ధరల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధికారులు వెల్లడించారు. పీఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం, వన్‌టౌన్‌ ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. కాగా ఐదు టీ20ల సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించగా టీమిండియా మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆస్ట్రేలియా జట్టుకు మాథ్యూ వేడ్ సారథ్యం వహించనున్నాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ బౌలర్లు భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-14T14:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising