Ind vs Aus: 16 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో భారత్
ABN, First Publish Date - 2023-03-17T17:58:14+05:30
189 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు(Team India)కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి.
ముంబై: 189 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు(Team India)కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. 16 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 5 పరుగుల వద్ద స్టోయినిస్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ ఇషాన్ కిషాన్ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆస్ట్రేలియా కూడా 5 పరుగుల వద్ద రెండో ఓవర్ చివరి బంతికే ట్రావిస్ హెడ్ (5) వికెట్‌ను కోల్పోవడం గమనార్హం.
కిషన్(Ishan Kishan) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli) దారుణంగా నిరాశ పరిచాడు. నాలుగు పరుగులు మాత్రమే చేసి స్టార్క్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) గోల్డెన్ డక్ అయ్యాడు. ఫలితంగా 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిశాయి. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (14), కేఎల్ రాహుల్ (5) క్రీజులో ఉన్నారు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లలో రెండు స్టార్క్‌కు దగ్గగా, స్టోయినిస్‌కు ఒకటి దక్కింది.
Updated Date - 2023-03-17T17:58:14+05:30 IST