ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs BAN Pitch Report:: బ్యాటర్లకు పండగే.. టాస్ గెలిచిన జట్టు ముందుగా ఏం చేయబోతుందంటే..?

ABN, First Publish Date - 2023-10-18T15:49:04+05:30

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నాలుగో విజయంపై కన్నేసింది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇదే ఊపులో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని రోహిత్ సేన భావిస్తోంది.

పుణె: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నాలుగో విజయంపై కన్నేసింది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇదే ఊపులో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని రోహిత్ సేన భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ జరిగే పుణె పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. పిచ్ ఉపరితలం సాధారణంగా ఉంటుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ముఖ్యంగా మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 300+ రన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇప్పటివరకు 7 వన్డే మ్యాచ్‌లు జరగగా 5 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 300+ స్కోర్లు చేశాయి. దీంతో బ్యాటర్లు పండగ చేసుకునే అవకాశాలున్నాయి. ఈ పిచ్‌‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి. ఇక్కడ జరిగిన 7 వన్డేల్లో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లే 4 సార్లు గెలిచాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 3 సార్లు గెలిచాయి. పైగా సెకండ్ ఇన్నింగ్స్‌లో 300+ టార్గెట్ కనుక ఉంటే ఈ పిచ్‌పై చేధించడం చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి ఈ పిచ్‌పై ముందు బ్యాటింగ్ చేయడమే ఉత్తమం. మంచి ప్రారంభం లభిస్తే భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


బౌలర్ల విషయానికొస్తే గత రికార్డుల ప్రకారం ఈ పిచ్‌పై మ్యాచ్ జరిగే కొద్దీ పేసర్లు కీలక పాత్ర పోషిస్తారు. స్పిన్నర్లకు కూడా కొంత సహకారం ఉంటుంది. ఈ పిచ్ మొదట్లో స్పిన్నర్లకు ఎక్కువగా సహకరించేది. కానీ ఈ మధ్య కాలంలో పేసర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. మొత్తంగా చూసిన పేసర్ల ప్రభావమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ పిచ్‌పై ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పేసర్ల ఖాతాలోనే పడ్డాయి. మొత్తంగా పుణె పిచ్ గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. ఇక్కడ ఇప్పటివరకు 7 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 4 సార్లు.. తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 3 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 307గా ఉంది. ఈ పిచ్‌పై అత్యధిక స్కోర్ 356గా నమోదైంది. అత్యల్ప స్కోర్ 232గా ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు 3 సార్లే గెలవగా.. టాస్ ఓడిన జట్లు 4 సార్లు గెలిచాయి. ఈ పిచ్‌పై పేసర్లు 32 సగటుతో 78 వికెట్లు తీశారు. స్పిన్నర్లు 57 సగటుతో 26 వికెట్లు తీశారు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా కాంబినేషన్ నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లుగానే ఉంటుందని అంతా భావిస్తున్నారు. కానీ బంగ్లాదేశ్‌లొ ఏకంగా నలుగురు, ఐదుగురు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉండడంతో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అశ్విన్‌కు ఎడమ చేతి బ్యాటర్లపై మంచి రికార్డు ఉండడం దీనికి కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు పిచ్‌‌పై స్పిన్నర్ల ప్రభావం కూడా ఉండే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా గురువారం ఉదయం పిచ్‌ను పరిశీలించాకే టీమిండియా మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోనుంది. మొత్తంగా అయితే శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఒక్కరినే తుది జట్టులోకి తీసుకోనున్నారు.

భారత్, బంగ్లాదేశ్ హెడ్ టూ హెడ్ రికార్డుల విషయానికొస్తే రెండు జట్లు వన్డేల్లో ఇప్పటివరకు 40 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రెండు జట్ల పోటీల్లో టీమిండియా సంపూర్ణ అధిపత్యం ప్రదర్శించింది. ఏకంగా 31 మ్యాచ్‌ల్లో గెలిచింది. బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఓవరాల్ రికార్డులు బాగానే ఉన్నా ఇటీవల బంగ్లాదేశ్‌పై భారత్ గణాంకాలు ఏమంతంగా బాగాలేవు. బంగ్లాదేశ్‌తో ఆడిన చివరి 4 వన్డేల్లో టీమిండియా మూడే గెలిచింది. ఆసియా కప్‌లో సైతం బంగ్లా చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే 2007 ప్రపంచకప్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడించిన రికార్డు కూడా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు.

Updated Date - 2023-10-18T15:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising