IND vs NZ: 20 ఓవర్లకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే..
ABN, First Publish Date - 2023-01-18T15:27:30+05:30
హైదరాబాద్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల (India vs New Zealand) మధ్య జరుగుతున్న తొలి వన్డేలో (1st ODI) టీమిండియా 20 ఓవర్లకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ..
హైదరాబాద్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల (India vs New Zealand) మధ్య జరుగుతున్న తొలి వన్డేలో (1st ODI) టీమిండియా 20 ఓవర్లకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. శ్రీలంకతో వన్డేల్లో సెంచరీలతో వీర విహారం చేసిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కివీస్ బౌలర్ శాంట్నర్ బౌలింగ్‌లో 8 పరుగులకే క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాథమ్‌కు క్యాచ్‌గా దొరికిపోయాడు. ఇలా.. 20 ఓవర్ల లోపే 3 కీలక వికెట్లను కోల్పోయిన టీమిండియా 114 పరుగుల చేసింది.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) 53 బంతుల్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. వన్డేల్లో గిల్‌కు ఇది 6వ ఆఫ్ సెంచరీ. 20 ఓవర్లు ముగిసేసరికి గిల్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) క్రీజులో ఉన్నారు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు బ్యాటర్లు నిలకడగా రాణించిన సంగతి తెలిసిందే. గిల్‌కు అవకాశం కల్పించడంపై విమర్శలు వచ్చినా.. అతడు తన బ్యాట్‌తోనే వాటికి సమాధానం చెప్పాడు. తొలి వన్డేలో అర్ధ శతకం సాధించిన గిల్.. మూడో మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపాడు. కివీస్‌తో తొలి వన్డేలో కూడా గిల్ రాణిస్తున్నాడు.
టీమిండియా బౌలింగ్ విషయానికొస్తే సొంత మైదానంలో ఆడుతున్న పేసర్ సిరాజ్‌పై అందరి దృష్టీ నెలకొననుంది. లంకతో సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో పేసర్‌గా శార్దూల్‌కు అవకాశం దక్కింది. మరోవైపు వన్డే సిరీస్‌లో పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై 2-1తో ఓడించిన న్యూజిలాండ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. పైగా టీమిండియాకు ఎప్పుడూ కఠిన సవాల్ విసిరే జట్టుగా కివీస్‌కు పేరుంది. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు విశ్రాంతినివ్వడంతో.. టామ్ లాథమ్ జట్టుకు సారథ్యం వహించాడు. ఓపెనర్ ఫిన్ అలెన్, కాన్వే, లాథమ్, ఫిలిప్స్ మంచి ఫామ్‌లో ఉండడం.. భారత బౌలర్లను కలవరపెట్టే విషయం.
Updated Date - 2023-01-18T15:27:33+05:30 IST