IND vs SL: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. సూర్యకుమార్‌ను పక్కన పెట్టేశారుగా..!
ABN, First Publish Date - 2023-01-10T13:25:31+05:30
టీమిండియా, శ్రీలంక (IND vs SL) మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో (IND ODI) శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. మూడు టీ20ల సిరీస్‌ను..
టీమిండియా, శ్రీలంక (IND vs SL) మధ్య గౌహతి వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో (IND ODI) శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. మూడు టీ20ల సిరీస్‌ను గెలుచుకున్న ఉత్సాహంలో ఉన్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌పై (One Day Series) కన్నేసింది. అందుకే యువ భారత్ చెలరేగిన తరహాలోనే శ్రీలంకపై ఇప్పుడు రోహిత్ ఆధ్వర్యంలోని వన్డే టీమ్ కూడా విరుచుకు పడాలనుకుంటోంది. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లతో పాటు పలువురు సీనియర్లకు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. 2015 నుంచి శ్రీలంకతో పూర్తిగా జరిగిన 13 వన్డేల్లో భారత్ 10-3తో ఆధిక్యంలో ఉంది. అటు 2020 నుంచి సొంతగడ్డపై జరిగిన 12 వన్డేల్లో భారత్ 9 మ్యాచ్‌ల్లో గెలవగా.. మరోవైపు లంక కూడా ఈ ఫార్మాట్‌లో గతేడాది ఆడిన 10 వన్డేల్లో ఆరింటిని నెగ్గింది. టీ20ల్లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్‌ను తొలి వన్డేకు పక్కనపెట్టేశారు.
టీ20ల్లో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ స్థానానికి శ్రేయాస్ అయ్యర్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో ఐదో నెంబర్‌లో ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనేది టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. అయితే.. శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకునేందుకే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. ఇక ఓపెనర్‌గా రోహిత్‌కు జతగా గిల్ ఆడనున్నాడు. ఇదిలావుండగా శ్రీలంకపై విరాట్ కోహ్లీ రికార్డు మాత్రం అద్భుతంగా ఉంది. 46 ఇన్నింగ్స్‌లో తను 2220 రన్స్ సాధించాడు. ఇందులో 8 శతకాలు, 11 హాఫ్ సెంచరీలున్నాయి. విశ్రాంతి తర్వాత బరిలోకి దిగబోతున్నాడు కాబట్టి ఈసారీ దుమ్ము రేపే అవకాశం ఉంది. ఇక స్పిన్‌లో చాహల్, ఉమ్రాన్, షమీ, సిరాజ్ పేసర్లతో టీమిండియా తొలి వన్డేలో బరిలోకి దిగనుంది. ఇక.. శ్రీలంక జట్టు విషయానికొస్తే.. దిల్షాన్ మధుషనక ఈ వన్డేతో డెబ్యూ మ్యాచ్ ఆడనున్నాడు.
Updated Date - 2023-01-10T13:25:35+05:30 IST