ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Sri Lanka: బాది పడేసిన బ్యాటర్లు.. శ్రీలంక ఎదుట కొండంత లక్ష్యం

ABN, First Publish Date - 2023-01-10T17:33:36+05:30

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇక్కడి బరస్పర క్రికెట్ స్టేడియంలో జరుగతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇక్కడి బరస్పర క్రికెట్ స్టేడియంలో జరుగతున్న తొలి వన్డేలో భారత్ (Team India) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించిన శ్రీలంక(Sri Lanka) ఆ తర్వాత చాలా పశ్చాత్తాపం పడి ఉంటుంది. భారత బ్యాటర్లు చెలరేగిపోతుంటే బౌలర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పోటీ పడి షాట్లు బాదుతుంటే స్టేడియం హెరెత్తి పోయింది. వారిద్దనీ విడదీసేందుకు లంక కెప్టెన్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది.

ఈ క్రమంలో 60 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేసిన గిల్‌ను షనక వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 143 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు, గిల్ అవుటైన తర్వాత రోహిత్ మరింత రెచ్చిపోయాడు. బంతులను చితకబాదాడు. గిల్ అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ అండగా బంతులను ఎడాపెడా బాదాడు. ఈ క్రమంలో 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగుల చేసిన రోహిత్ సెంచరీ ముగింట అవుటై నిరాశ పరిచాడు.

ఇంకోవైపు, క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ తొలుత నిదానంగా ఆడినప్పటికీ ఆ తర్వాత మునుపటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. యథేచ్ఛగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో వన్డేల్లో 45వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 87 బంతులు ఆడిన కోహ్లీ 113 పరుగుల చేసి రజిత బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత వికెట్లు టపటపా రాలిపోయాయి. కేఎల్ రాహుల్ 39, హార్దిక్ పాండ్యా 14, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు. షమీ (4), సిరాజ్ (7) నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కాసున్ రజిత 3 వికెట్లు తీసుకున్నాడు.

Updated Date - 2023-01-10T17:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising