ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. సౌతాఫ్రికా పర్యటన నుంచి వరల్డ్‌కప్ హీరో ఔట్!

ABN, Publish Date - Dec 16 , 2023 | 11:27 AM

సౌతాఫ్రికాతో పర్యటనలో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా రాణించిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

సౌతాఫ్రికాతో పర్యటనలో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా రాణించిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. షమీ ఫిట్‌నెస్‌కు సంబంధించి బీసీసీఐ మెడికల్ టీం ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో షమీ సౌతాఫ్రికా వెళ్లలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ సైతం అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు భారత క్రికెట్ గవర్నింగ్ బాడీ నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న మహ్మద్ షమీ ముంబైలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్ల కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కాగా ప్రస్తుతానికి షమీ స్థానంలో సెలెక్టర్లు మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. అయితే త్వరలోనే ఎంపిక చేసే అవకాశాలున్నాయి.


సౌతాఫ్రికా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపికైన దీపక్ చాహర్ సైతం జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తండ్రి అనారోగ్య కారణాల రీత్యా చాహర్ సౌతాఫ్రికాకు వెళ్లలేదు. అతని స్థానంలో బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌నకు చోటు దక్కింది. ఇక సౌతాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌ను భారత జట్టు 1-1తో సమం చేసింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 26 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది.

టీమిండియా టెస్ట్ జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.

Updated Date - Dec 16 , 2023 | 11:27 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising