ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2011WorldCup: ప్రపంచ కప్-2011 ఫైనల్ మ్యాచ్‌పై కొత్త విషయాన్ని పంచుకున్న ఎంఎస్ ధోనీ

ABN, First Publish Date - 2023-04-03T16:42:25+05:30

మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని భారత జట్టు(Team India) వన్డే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని భారత జట్టు(Team India) వన్డే ప్రపంచకప్ (2011) గెలిచి 12 ఏళ్లు అయింది. ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ధోనీ సేన(Dhoni Team) ప్రపంచకప్‌ను సగర్వంగా ముద్దాడింది. తాజాగా, ఈ ప్రపంచకప్ గురించి ధోనీ ఓ కొత్త విషయాన్ని పంచుకున్నాడు. ఈ టోర్నీలో అంతగా ఫామ్‌లోని ఎంఎస్.. ఫైనల్లో అజేయంగా 91 పరుగులు చేసి భారత అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. తాజాగా, ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి ‘బెస్ట్ మెమరీని’ ధోనీ వెల్లడించాడు. నువాన్ కులశేఖర(Nuwan Kulasekara) బౌలింగులో కొట్టిన విన్నింగ్స్ సిక్స్ తనకు అత్యంత మధుర జ్ఞాపకమని చెప్పుకొచ్చాడు. విజయం సాధించడానికి ముందు 15-20 నిమిషాలు తనకు గొప్ప అనుభూతిని మిగిల్చాయన్నాడు.

అప్పుడు తమకేమీ ఎక్కువ పరుగులు అవసరం లేదని, భాగస్వామ్యం కూడా బాగా కుదిరిందని ధోనీ గుర్తు చేసుకున్నాడు. స్టేడియంలో ‘వందేమాతరం’ కూడా మొదలైందని, మళ్లీ అలాంటి వాతావరణాన్ని తీసుకురావడం కష్టమని భావిస్తున్నానని ధోనీ చెప్పుకొచ్చాడు. అయితే స్టేడియం, అభిమానులు కనుక సహకరిస్తే ఈ ప్రపంచకప్ (2023)లో ఇలాంటి దృశ్యం చూడొచ్చని అన్నాడు.

‘‘మీకు తెలుసా? దీనిని పునరావృతం చేయడం చాలా కష్టం. అయితే, పరిస్థితులు అప్పటిలానే (2011)లానే ఉండి, 40-50 వేల మంది, లేదంటే 60 వేల మంది ప్రేక్షకులు పాడుతుంటే అలాంటి వాతావరణాన్ని మళ్లీ తీసుకురావొచ్చు’’ అని ధోనీ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో తాము గెలుస్తామని, ట్రోఫీని ముద్దాడతామని తమకు తెలుసని అన్నాడు.

ఈ గెలుపుతో ట్రోఫీని అందుకోవాలన్న ఇండియన్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కోరిక కూడా నెరవేరింది. ఆ క్షణం కోసం సచిన్ ఏకంగా రెండు దశాబ్దాలు వేచి చూశాడు. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ తిరిగి భారత్ సొంతం కావడంతో దేశం సంబరాల్లో మునిగిపోయింది.

Updated Date - 2023-04-03T16:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising