ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PCB: బీసీసీఐ ఉద్దేశాన్ని బయటపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

ABN, First Publish Date - 2023-01-26T18:21:46+05:30

ఈ ఏడాది ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఎప్పుడైతే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: ఈ ఏడాది ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఎప్పుడైతే ఆతిథ్య బాధ్యతలు పాక్ చేతుల్లోకి వెళ్లాయో అప్పటి నుంచి బీసీసీఐ(BCCI)-పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం మొదలైంది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరమైన కారణాల నేపథ్యంలో ఆసియాకప్ కోసం భారత జట్టును అక్కడికి పంపించలేమని బీసీసీఐ ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పేసింది. దీంతో భారత జట్టు పాకిస్థాన్ తమ వైఖరిని స్పష్టం చేసింది. ఇదే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం తాము కూడా భారత్ రాలేమని తేల్చి చెప్పింది. దీంతో ఆసియాకప్‌లో భారత్, వన్డే ప్రపంచకప్‌లో పాక్ ఆడడంపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో రమీజ్ రాజా(Ramiz Raja) స్థానంలో పీసీబీ చీఫ్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన నజమ్ సేథీ(Najam Sethi) ఈ విషయంపై కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశం జరగనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 4న బెహ్రయిన్‌లో జరగనున్న సమావేశానికి తాను హాజరవుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికైతే తమ వైఖరేంటి? అన్న విషయం కచ్చితంగా తెలియదన్న ఆయన.. సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే, అది పాకిస్థాన్ క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని కచ్చితంగా చెప్పగలనన్నారు.

వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని, కానీ ఆసియాకప్ కోసం మాత్రం తమ జట్టును పాకిస్థాన్ పంపేందుకు సిద్ధంగా లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్ మాత్రం భారత్ రావాలని, ఇండియా మాత్రం పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదని అన్నారు. అయినా, ఇది తమకేమీ కొత్త కాదని సేథీ తెలిపారు.

Updated Date - 2023-01-26T18:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising