ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup 2023: గెలుపు జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. కేన్ విలియమ్సన్ మళ్లీ..

ABN, First Publish Date - 2023-10-08T13:17:08+05:30

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి వరల్డ్ కప్‌ను ఘనంగా ఆరంభించిన న్యూజిలాండ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. కివీస్ తమ తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సోమవారం ఈ మ్యాచ్ జరగనుంది. కానీ ఇంతలోనే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి వరల్డ్ కప్‌ను ఘనంగా ఆరంభించిన న్యూజిలాండ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. కివీస్ తమ తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. సోమవారం ఈ మ్యాచ్ జరగనుంది. కానీ ఇంతలోనే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం నుంచి ఇంకా పూర్తి కోలుకోలేదు. దీంతో అతను నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు సైతం దూరం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ప్రకటించాడు. విలియమ్సన్ ఈ నెల 13న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా కివీస్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరించనున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌కు విలియమ్సన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ మ్యాచ్‌లోనూ కివీస్‌ను లాథమే నడిపించాడు.


అయితే గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన పేసర్ లూకీ ఫెర్గూసన్ మాత్రం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతను నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే ఫెర్గ్యూసన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరోవైపు కివీస్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే సౌథీ చేతి వేలికి మరోసారి ఎక్స్‌ రే తీయనున్నారు. ఆ తర్వాతే సౌథీ సెలక్షన్‌పై ఓ నిర్ణయం తీసుకుంటామని కివీస్ హెడ్ కోచ్ తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ సునాయసంగా చేధించింది. లక్ష్య చేధనలో ఆ జట్టు బ్యాటర్లు డేవాన్ కాన్వే(152), రచిన్ రవీంద్ర(123) అజేయ సెంచరీలతో దుమ్ములేపారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 273 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Updated Date - 2023-10-08T13:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising