ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Zealand: టీమిండియా చేతిలో ఓటమితో కివీస్‌కు భారీ షాక్!

ABN, First Publish Date - 2023-01-22T14:07:56+05:30

భారత్‌తో రాయ్‌పూర్‌లో జరిగిన వన్డేలో భారీ ఓటమి చవిచూసిన న్యూజిలాండ్‌(New Zealand)కు మరో షాక్ తగిలింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌తో రాయ్‌పూర్‌లో జరిగిన వన్డేలో భారీ ఓటమి చవిచూసిన న్యూజిలాండ్‌(New Zealand)కు మరో షాక్ తగిలింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌(ICC One Day Rankings)లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఫలితంగా ఇంగ్లండ్(England) నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కివీస్‌తో ఈ నెల 24న ఇండోర్‌లో జరగనున్న చివరి వన్డేలో కనుక భారత్(Team India) విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంటుంది.

ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా తలా 113 రేటింగ్ పాయింట్స్‌తో వరుసగా ఒకటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌తో రెండో వన్డేకు ముందు న్యూజిలాండ్ 115 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా(Australia) 112 పాయింట్లతో మూడో స్థానంలో, 111 పాయింట్లతో ఇండియా నాలుగో స్థానంలో ఉండేవి. ఈ మ్యాచ్‌తో ఈ స్థానాలన్నీ తారుమారయ్యాయి.

భారత్‌తో ఓటమి తర్వాత న్యూజిలాండ్ 113 రేటింగ్ పాయింట్లు, మొత్తంగా 3,166 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్, ఇండియా ఒకటి, మూడు స్థానాలకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా 112 పాయింట్లతో నాలుగో స్థానంలో, 106 పాయింట్లతో పాకిస్థాన్(Pakistan) ఐదో స్థానంలో ఉంది.

మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. టీ20ల్లో భారత్ ఇప్పటికే నంబర్ వన్ స్థానంలో, టెస్టుల్లో రెండో స్థానంలో ఉంది. 126 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. భారత్ కంటే 11 పాయింట్లు మాత్రమే ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు జరుగుతాయి. ఈ సిరీస్‌లో కనుక భారత్ విజయం సాధిస్తే టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానం భారత్ సొంతమవుతుంది.

భారత జట్టు ఇప్పటికే స్వదేశంలో తుక్కు రేగ్గొడుతోంది. శ్రీలంకను 3-0తో మట్టికరిపించింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. టెస్టుల్లోనూ అదే దూకుడు కొనసాగిస్తే ఇక రోహిత్ సేనకు ఎదురులేనట్టే!

Updated Date - 2023-01-22T14:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising