ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NZ Vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘనవిజయం.. పాకిస్థాన్ ఆశలు గల్లంతు

ABN, First Publish Date - 2023-11-09T20:23:35+05:30

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో నాలుగో సెమీస్ బెర్త్ దాదాపు న్యూజిలాండ్ కైవసం చేసుకున్నట్లే భావించాలి. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది.

వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత గెలిచి దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మరో 160 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (45), రచిన్ రవీంద్ర (42) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీళ్లిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ విలియమ్సన్ (14) విఫలమయ్యాడు. డారిల్ మిచెల్ (43) కూడా రాణించడంతో న్యూజిలాండ్ 23.2 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టగా.. మహీష్ తీక్షణ, దుష్మంత చమీరా తలో వికెట్ సాధించారు.

న్యూజిలాండ్ తాజా గెలుపుతో పాకిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కానీ న్యూజిలాండ్ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఒకవేళ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ గెలిచినా భారీ తేడాతో గెలవాలి. ప్రస్తుతానికి న్యూజిలాండ్‌కు 0.7 నెట్ రన్‌రేట్ ఉండగా.. పాకిస్థాన్‌కు 0.03 రన్‌రేట్ మాత్రమే ఉంది. దీంతో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ సుమారు 288 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అప్పుడే న్యూజిలాండ్ కంటే పాకిస్థాన్ నెట్‌రన్‌రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే 5 ఓవర్లలోనే పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించాలి. ఇది అసాధ్యం కాబట్టి న్యూజిలాండ్ సెమీస్‌ కోసం నాలుగో బెర్త్ కైవసం చేసుకుని ఈనెల 15న ముంబై వేదికగా టీమిండియాతో తలపడటం ఖరారైనట్లే భావించాలి. అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ జట్టు బౌలర్లు విజృంభించడంతో 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-09T20:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising