PAK vs AUS 2nd Test: ఎక్స్‌ట్రా రన్స్‌లో పాకిస్థాన్ చెత్త రికార్డు.. ఏకంగా 50కి పైగా..
ABN, Publish Date - Dec 27 , 2023 | 11:43 AM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు ఏకంగా 50కిపైగా ఎక్స్‌ట్రా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఎక్స్‌ట్రాల రూపంలో పరుగులు సమర్పించుకునే విషయంలో పాకిస్థాన్ బౌలర్లు హాఫ్ సెంచరీని అందుకున్నారు.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు ఏకంగా 50కిపైగా ఎక్స్‌ట్రా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఎక్స్‌ట్రాల రూపంలో పరుగులు సమర్పించుకునే విషయంలో పాకిస్థాన్ బౌలర్లు హాఫ్ సెంచరీని అందుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లంతా కలిసి ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నారు. ఇందులో బైస్ రూపంలో 20, లెగ్ బైస్ రూపంలో 15, వైడ్ల రూపంలో 15, నోబాల్స్ రూపంలో 2 పరుగులు ఇచ్చారు. పాకిస్థాన్ బౌలర్ల చెత్త బౌలింగ్ కారణంగా ఎక్స్‌ట్రాల రూపంలో వికెట్ల వెనుకకు 5 ఫోర్లు వెళ్లాయి. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో అత్యధిక రన్స్ సమర్పించుకున్న రెండో జట్టుగా పాకిస్థాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో కూడా పాకిస్థానే ఉంది. 2007లో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నారు.
ఇక మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 318 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లు అంతగా రాణించకపోయినప్పటికీ పాక్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో పరుగులు భారీగా సమర్పించుకోవడంతో ఆస్ట్రేలియా స్కోర్ 300 దాటింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు 131 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. కాగా పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ ఘోరపరాజయం పాలైంది. 360 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 27 , 2023 | 11:43 AM