ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Salman Butt: సూర్యకుమార్ చెత్తగా ఆడాడు.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ విమర్శలు

ABN, First Publish Date - 2023-11-21T21:51:38+05:30

ODI World Cup: అయితే ప్రపంచకప్‌లో సూర్యకుమార్ చెత్తగా ఆడాడంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ విమర్శలు చేశాడు. అసలు ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆలోచనా విధానం తనను ఆశ్చర్యపరిచిందని.. అతడు ఎలా ఆడాలని భావించాడో తెలియలేదని పేర్కొన్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన 11 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు గెలిచింది. కేవలం ఫైనల్లో మాత్రమే పరాజయం పాలైంది. గెలిచిన 10 మ్యాచ్‌లలో రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయాస్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించారు. కానీ ఏడు మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ మాత్రం రాణించిన దాఖలాలు లేవు. సెమీఫైనల్ వరకు అతడికి అవకాశాలు రాక ఆడలేదని అందరూ భావించారు. కానీ కీలకమైన ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మైదానంలోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ దారుణ ప్రదర్శన చేశాడు. తనకు అలవాటైన ఆట ఆడకుండా అతిగా డిఫెన్స్ ఆడి టీమ్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. కనీసం బంతిని ఫేస్ చేయడానికి ఆలోచించిన అతడు.. టెయిలెండర్లను ఎక్కువగా స్ట్రైకింగ్‌కు పంపడం అభిమానులకు చికాకు తెప్పించింది. దీంతో టీమిండియా చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

అయితే ప్రపంచకప్‌లో సూర్యకుమార్ చెత్తగా ఆడాడంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ విమర్శలు చేశాడు. అసలు ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆలోచనా విధానం తనను ఆశ్చర్యపరిచిందని.. అతడు ఎలా ఆడాలని భావించాడో తెలియలేదని పేర్కొన్నాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో అద్భుత షాట్లు ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాలని.. కానీ సూర్యకుమార్ మాత్రం సింగిల్స్ తీసుకుని నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు వెళ్లిపోయాడని.. ఆ సమయంలో సూర్య ఏ ఆలోచనతో ఈ పని చేశాడో తనకు ఏమాత్రం అర్థం కాలేదని భట్ అన్నాడు. అసలే పిచ్‌లో కొంత రివర్స్ స్వింగ్ ఉందని.. ఆసీస్ వద్ద అద్భుతమైన పేసర్లు ఉన్నారని.. వాళ్లను షమీ, బుమ్రా ఆడలేని పరిస్థితుల్లో సూర్య బాధ్యత తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. దురదృష్టవశాత్తూ సూర్యకుమార్ అలా చేయలేదని సల్మాన్ భట్ విశ్లేషించాడు. కాగా ప్రపంచకప్‌లో సూర్యకుమార్ 7 మ్యాచ్‌లు ఆడాడు. న్యూజిలాండ్‌పై 4, ఇంగ్లండ్‌పై 49, శ్రీలంకపై 12, దక్షిణాఫ్రికాపై 22, నెదర్లాండ్స్‌పై 2, న్యూజిలాండ్‌పై 1, ఆస్ట్రేలియాపై 18 పరుగులు మాత్రమే చేశాడు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-21T21:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising