PAK Vs BAN: పాకిస్థాన్‌కు ఊరట.. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు
ABN, First Publish Date - 2023-10-31T21:16:16+05:30
వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి ఊరట పొందింది.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఎట్టకేలకు మూడో విజయం సాధించింది. టీమిండియాతో ఓటమి తర్వాత డీలా పడ్డ పాకిస్థాన్ హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. అయితే ఈరోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి ఊరట పొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లు ఆడలేకపోయింది. చివరకు 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. 205 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇమాముల్ హక్‌ను పక్కనపెట్టి ఫకార్ జమాన్‌ను తీసుకోవడం పాకిస్థాన్‌కు కలిసొచ్చింది. అతడు బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 74 బాల్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 81 రన్స్ చేయడంతో పాటు మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్‌తో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగులు జోడించాడు. అబ్దు్ల్లా షఫీఖ్ 69 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 రన్స్ చేశాడు.
అయితే ఒక దశలో పాకిస్థాన్ వికెట్లేమీ కోల్పోకుండా మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. మెహిదీ హసన్ మిరాజ్ ఖాతాలోకే ఈ మూడు వికెట్లు వెళ్లాయి. చివరకు 32.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 205 పరుగుల టార్గెట్‌ను పాకిస్థాన్ అందుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది మూడో విజయం. నెదర్లాండ్స్, శ్రీలంకపై గెలిచిన పాకిస్థాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను ఓడించి ఆరు పాయింట్లను సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బాబర్ సేన సెమీస్ చేరాలంటే మిగతా రెండు మ్యాచ్‌లు గెలవడమే కాకుండా మిగతా జట్ల ఫలితాలు వాళ్లకు కలిసి రావాలి. 81 రన్స్‌తో రాణించిన ఫకార్ జమాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
Updated Date - 2023-10-31T21:16:16+05:30 IST