Hyderabad Police: ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లపై సీపీ ఏమన్నారంటే..!
ABN, First Publish Date - 2023-10-05T14:44:16+05:30
వన్డే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. నేటి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియాన్ని సీపీ పరిశీలించి మాట్లాడారు. ‘‘1200 మంది పోలీసులతో బందోబస్తు
హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. నేటి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియాన్ని సీపీ పరిశీలించి మాట్లాడారు. ‘‘1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు. హైదరాబాద్ ప్రజలు ఉత్సాహంగా మ్యాచ్‌లు చూడటానికి వస్తారు. ఒక ప్లాన్ ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. వారం రోజుల క్రితం హెచ్‌సీఏతో మీటింగ్ పెట్టాం. ఐపీఎల్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాం. ఇక్కడికి వచ్చే టీమ్స్‌కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తాం. 11 గంటలకు ప్రేక్షకులను గ్రౌండ్‌లోకి అనుమతిస్తాం. 2 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పార్కింగ్ విషయంలో స్పెషల్ ప్లాన్ చేశాం. పార్కింగ్ ప్లేసెస్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశాం. ట్రాఫిక్ డైవర్షన్స్ అడ్వైజరీ కూడా ఇష్యూ చేస్తాం. బయట నుంచి ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ గ్రౌండ్‌లోకి అనుమతి లేదు. కంట్రోల్ రూమ్ ద్వారా సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తాం. గ్రౌండ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరు కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 40 వేలు. మ్యాచ్ అయిపోయినా అందరూ ఒకేసారి బయటకి వెళ్లకుండా మెల్లగా వెళ్లాలి. క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ గ్రౌండ్ లోపలా బయటా మఫ్టీలో ఉంటారు. ప్రేక్షకులకు వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని హెచ్‌సీఏకి సూచించాం. బ్లాక్ టికెట్స్ అమ్మేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టాం.’’ అని సీపీ తెలిపారు.
Updated Date - 2023-10-05T16:09:13+05:30 IST