ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup 2023: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు.. టీమిండియా ఓటమికి కారణం అదే..!!

ABN, First Publish Date - 2023-11-21T17:06:32+05:30

Rahul Gandhi: వన్డే ప్రపంచకప్ ముగిసినా టీమిండియా ఓటమి ఇంకా అందరినీ వెంటాడుతూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు టీమిండియా ఓటమికి కారణాలు విశ్లేషిస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమిండియా ఓటమికి గల కారణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వన్డే ప్రపంచకప్ ముగిసినా టీమిండియా ఓటమి ఇంకా అందరినీ వెంటాడుతూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు టీమిండియా ఓటమికి కారణాలు విశ్లేషిస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమిండియా ఓటమికి గల కారణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి పనౌతి (చెడుశకునం) వచ్చాడని.. దీంతో టీమిండియా గెలిచే మ్యాచ్‌ కూడా ఓడిపోయిందని ఆరోపించారు. టీవీలలో ఈ విషయాన్ని చూపించరని.. కానీ దేశ ప్రజలకు ఈ విషయం తెలుసు అని రాహుల్ వ్యాఖ్యానించారు.

కాగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే సమయంలో ఆయన స్టేడియానికి వచ్చారు. ఈ మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 47 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అందరూ టీమిండియానే గెలుస్తుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత వికెట్ పడలేదు. టోర్నీ మొత్తం అదరగొట్టే ప్రదర్శన చేసిన భారత బౌలర్లు ఫైనల్లో మాత్రం తేలిపోయారు. టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన షమీ కూడా ఫైనల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. చివరకు ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించిన వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-21T17:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising