ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: ఐసీసీ టోర్నీల్లో వర్షం పడితే టీమిండియా పని అంతేనా..?

ABN, First Publish Date - 2023-10-03T18:44:47+05:30

ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీల్లో వర్షం కారణంగా టీమిండియాకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వరుణుడి వల్ల కీలక ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు సరైన ప్రాక్టీస్ లభించలేదు. దీంతో నేరుగా ప్రపంచకప్ బరిలోకి దిగి పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

ఐసీసీ టోర్నీల్లో దురదృష్టం వెంటాడేది ఏ జట్టును అని క్రికెట్ అభిమానులను అడిగితే దక్షిణాఫ్రికా అని టక్కున సమాధానం చెప్పేస్తారు. అయితే కాలం మారుతోంది. ఇప్పుడు ఆ దురదృష్టం టీమిండియాను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వరుణుడి వల్ల కీలక ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు సరైన ప్రాక్టీస్ లభించలేదు. దీంతో నేరుగా ప్రపంచకప్ బరిలోకి దిగి పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈనెల 8న ఆస్ట్రేలియాతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. రెండు వార్మప్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు కాగా ప్రధాన టోర్నీలో మ్యాచ్‌ల నిర్వహణపై సందేహం నెలకొంది. ఈ సంగతి పక్కన పెడితే వర్షం పడితే టీమిండియా పరిస్థితేంటి అన్న విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఇది కూడా చదవండి: ODI World Cup 2023: టీమిండియా రెండో వార్మప్ మ్యాచ్ కూడా వర్షార్పణం..!!

ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నమెంట్‌లలో వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగిన ప్రతీసారి టీమిండియాకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డేతో కలుపుకుని రెండు రోజుల పాటు సాగింది. బౌలింగ్‌లో సత్తా చాటిన టీమిండియా.. ఓవర్ కాస్ట్ కండిషన్స్ వల్ల బ్యాటింగ్‌లో విఫలమై ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఎడిషన్ ఫైనల్లోనూ టీమిండియాను వరణుడు కొంపముంచాడు. రిజర్వ్‌డేతో కలుపుకుని 6 రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో వాతావరణ పరిస్థితులు టీమిండియా ఆటను ప్రభావితం చేశాయి. దాంతో న్యూజిలాండ్‌పై ఓటమి చెంది టీమిండియా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. అంతకుముందు కూడా పలు కీలక మ్యాచ్‌లలో వర్షం కారణంగా టీమిండియా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే టీమిండియాను వరుణ గండం వెంటాడుతుందని, దోష నివారణ పుజ చేయించాలని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-10-03T18:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising