కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rinku Singh: నాకు ఎమోషన్స్ ఎక్కువ.. అప్పుడు గ్యారంటీగా ఏడ్చేస్తా..!!

ABN, First Publish Date - 2023-07-16T16:35:12+05:30

ఆసియా క్రీడల టీమిండియా జట్టులో తనకు చోటు కల్పించడంపై రింకూ సింగ్ స్పందించాడు. తనకు చాలా ఎమోషన్స్ ఎక్కువ అని.. టీమిండియా జెర్సీ వేసుకున్నప్పుడు తన కళ్లలో కచ్చితంగా నీళ్లు వచ్చేస్తాయని అన్నాడు. టీమిండియా జెర్సీలో చూస్తే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని.. ఆ క్షణం కోసం తన కుటుంబం ఎదురుచూస్తోందన్నాడు.

Rinku Singh: నాకు ఎమోషన్స్ ఎక్కువ.. అప్పుడు గ్యారంటీగా ఏడ్చేస్తా..!!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా(Team India)లో ఇప్పుడు యువ ఆటగాళ్ల హవా నడుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియాలో క్రేజ్ ఉంది యువ ఆటగాళ్లకే. శుభ్‌మన్ గిల్ (Shubman Gill), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), ఇషాన్ కిషన్ (ishan Kishan), యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) వంటి ఆటగాళ్లు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఆసియా క్రీడలకు టీమిండియా వెళ్తుందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి భారత్‌కు మరో గోల్డ్ మెడల్ (Gold Medal) వచ్చినట్లేనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టుపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు పాల్గొననుండటం ఇదే తొలిసారి. ఇటీవల టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను నియమించింది. ఆసియా కప్, ప్రపంచకప్ దగ్గర పడుతున్న తరుణంలో ఆసియా క్రీడలకు పూర్తిగా యువ జట్టునే బీసీసీఐ పంపుతోంది. ఈ జట్టులో ఫినిషర్‌గా రింకూ సింగ్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. అందుకే అతడిని వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున నిలకడగా రాణించాడు.

ఇది కూడా చదవండి: Jayaram: గుండెపోటుతో టీమిండియా మాజీ సెలెక్టర్ కన్నుమూత

ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల టీమిండియా జట్టులో తనకు చోటు కల్పించడంపై రింకూ సింగ్ స్పందించాడు. తనకు చాలా ఎమోషన్స్ ఎక్కువ అని.. టీమిండియా జెర్సీ వేసుకున్నప్పుడు తన కళ్లలో కచ్చితంగా నీళ్లు వచ్చేస్తాయని అన్నాడు. టీమిండియా జెర్సీలో చూస్తే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని.. ఆ క్షణం కోసం తన కుటుంబం ఎదురుచూస్తోందన్నాడు. తాను బలంగా ఉంటానని.. కానీ ఎంతో సున్నిత మనస్కుడినని రింకూ సింగ్ చెప్పాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని.. చాలా కాలం పాటు ఈ క్షణాల కోసం ఎదురుచూశానని వివరించాడు. క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ టీమిండియాకు ఆడాలని కలలు కంటారని.. అందులో తాను కూడా ఉన్నానని రింకూ సింగ్ తెలిపాడు. అయితే తాను భవిష్యత్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదని.. అలా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. అందుకే తాను ఈరోజు గురించే ఆలోచిస్తానని.. రేపటి గురించి ఆలోచించనని పేర్కొన్నాడు.

Updated Date - 2023-07-16T16:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising