ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Warm up: ఓపెనర్లుగా రోహిత్, యషస్వీ జైశ్వాల్.. కోహ్లీ అట్టర్ ఫ్లాప్

ABN, First Publish Date - 2023-07-06T16:28:45+05:30

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా గ్రౌండ్ ప్రాక్టీస్ షురూ చేసింది. 17 మంది సభ్యుల టీమిండియా రెండుగా విడిపోయి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. బ్యాటర్లు ఒక టీమ్‌గా, బౌలర్లు మరో టీమ్‌గా తలపడుతున్నారు. అయితే అనూహ్యంగా వార్మప్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ స్థానంలో యువ క్రికెటర్ యషస్వీ జైశ్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీసీ ప్రపంచ ఛాంపియన్ షిప్ తర్వాత టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈనెల 12 నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ మేరకు మైదానంలో కసరత్తులు ప్రారంభించింది. మంగళవారం వరకు నెట్స్‌లో చెమటోడ్చిన టీమ్ బుధవారం నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ షురూ చేసింది. 17 మంది సభ్యుల టీమిండియా రెండుగా విడిపోయి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. బ్యాటర్లు ఒక టీమ్‌గా, బౌలర్లు మరో టీమ్‌గా తలపడుతున్నారు.

ఇది కూడా చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ గుడ్‌బై

అయితే అనూహ్యంగా వార్మప్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ స్థానంలో యువ క్రికెటర్ యషస్వీ జైశ్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు మ్యాచ్ ప్రాక్టీస్ చేశాడు. వీళ్లిద్దరూ తొలి సెషన్‌లో చక్కగా ఆడారు. చూడముచ్చటైన షాట్లతో హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా జైశ్వాల్ అదరగొట్టాడు. హాఫ్ సెంచరీల తర్వాత రోహిత్, జైశ్వాల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ మాత్రం నిరాశపరిచాడు. ఉనద్కట్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ అవతల పడిన బంతిని ఆడి వికెట్ సమర్పించుకున్నాడు.

కోహ్లీ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానె కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అతడు కూడా ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులోనూ ఓపెనర్లుగా రోహిత్, జైశ్వాల్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుజారా స్థానంలో జట్టులోకి వచ్చిన జైశ్వాల్ ఓపెనర్‌గా రానుండగా.. రెగ్యులర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో రానున్నట్లు వార్మప్ మ్యాచ్ ద్వారా తెలుస్తోంది. అయితే వార్మప్ మ్యాచ్‌లో విఫలమైన కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - 2023-07-06T16:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising