ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WI Vs IND 1st ODI: బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు.. కెప్టెన్ రోహిత్ ఏమన్నాడంటే..?

ABN, First Publish Date - 2023-07-28T11:41:06+05:30

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియాలో బ్యాటింగ్ మార్పులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఓపెనర్‌గా రావాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మ7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులపై కెప్టెన్ రోహిత్ వివరణ ఇచ్చాడు. అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని తాము భావించామని.. అందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేశామని తెలిపాడు. ప్రపంచకప్ కోసం ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తామని.. ఈ క్రమంలో ఫలితాలపై అస్సలు రాజీపడని చెప్పాడు.

వెస్టిండీస్‌ (West Indies) పర్యటనలో టీమిండియా (Team India) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను గెలుపుతో బోణి చేసింది. గురువారం బార్బడోస్ (Barbadose) వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌పై 5 వికెట్ల విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో బ్యాటింగ్ మార్పులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఓపెనర్‌గా రావాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐదు వికెట్లు పడినా మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అసలు బ్యాటింగ్‌కే రాలేదు. దీంతో కెప్టెన్, మాజీ కెప్టెన్‌కు ఏమైందని అభిమానులు ఆందోళన చెందారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులపై కెప్టెన్ రోహిత్ వివరణ ఇచ్చాడు.

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుందని.. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని తాము భావించామని.. అందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేశామని తెలిపాడు. ప్రపంచకప్ కోసం ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తామని.. ఈ క్రమంలో ఫలితాలపై అస్సలు రాజీపడని చెప్పాడు. ఓ వైపు ప్రయోగాలు చేస్తూనే మరోవైపు విజయాల కోసం కృషి చేస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తాను 7వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపైనా రోహిత్ స్పందించాడు. తనకు 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడం కొత్తేమీ కాదని.. కెరీర్ ప్రారంభంలో తాను అక్కడే బ్యాటింగ్ చేశానని గుర్తుచేశాడు. తొలి వన్డేలో తనకు ఆరోజులు మళ్లీ గుర్తొచ్చాయని వివరించాడు. అయితే అన్ని మ్యాచ్‌లలోనూ అందరికీ అవకాశాలు వస్తాయని గ్యారంటీ ఇవ్వలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

ఇది కూడా చదవండి: Siraj: వన్డే సిరీస్‌కు సిరాజ్‌ దూరం

తొలి వన్డేలో సంజు శాంసన్‌ను ఎందుకు పక్కన పెట్టారని మీడియా ప్రశ్నించగా.. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కోసమే సంజూను ఆడించలేదని రోహిత్ అన్నాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో ఎలాంటి సందేహాలు లేకుండా టీమ్ కాంబినేషన్ ఎంచుకోవాలనుకుంటున్నామని తెలిపాడు. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు పరిస్థితులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. తొలి వన్డేలో ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడాడని ప్రశంసలు కురిపించాడు.

Updated Date - 2023-07-28T11:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising