ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: ఒకే దెబ్బకు మూడు పిట్టలు.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డులే రికార్డులు..!!

ABN, First Publish Date - 2023-10-11T20:07:14+05:30

ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఏకంగా సెంచరీతో రాణించడంతో పాటు మూడు రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

ఢిల్లీ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఏకంగా సెంచరీతో రాణించడంతో పాటు మూడు రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. తొలుత అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును సాధించాడు. ఇప్పటివరకు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరుతో ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. భారత ఇన్నింగ్స్‌‌లో 8వ ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ హక్ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 554 సిక్స్‌లు బాదాడు. గేల్ 551 ఇన్నింగ్స్‌లలో 553 సిక్సర్లు బాదగా.. రోహిత్ మాత్రం 473 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను సాధించాడు. టెస్టుల్లో 77, వన్డేల్లో 295, టీ20ల్లో 182 సిక్సర్లను రోహిత్ బాదాడు.

మరోవైపు వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కేవలం 19 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగుల మార్క్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 19 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (20 ఇన్నింగ్స్‌లు), ఏబీ డివిలియర్స్ (20 ఇన్నింగ్స్‌లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఇది కూడా చదవండి: ODI World Cup 2023: వాళ్ల కోసమే ఈ మ్యాచ్ గెలిచాం.. పాకిస్థాన్ క్రికెటర్ సంచలన ప్రకటన

అటు వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆప్ఘనిస్తాన్‌పై సెంచరీ చేసిన రోహిత్‌కు ప్రపంచకప్ చరిత్రలో ఇది ఏడో సెంచరీ. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్.. అంతకుముందు 2015లోనూ ఓ సెంచరీ చేశాడు. దీంతో మొత్తం అతడి ఖాతాలో ఏడు సెంచరీలు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న సచిన్ కేవలం ఆరు సెంచరీలు మాత్రమే చేశాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం సంగక్కర, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఐదు సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డేవిడ్ వార్నర్ ఖాతాలో ఇప్పటివరకు నాలుగు వన్డే ప్రపంచకప్ సెంచరీలు ఉన్నాయి. కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా (63 బంతుల్లో) సెంచరీ చేసిన భారత ఆటగాడిగానూ రోహిత్ రికార్డు సాధించాడు.

Updated Date - 2023-10-11T20:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising